తెలంగాణలో కొంతమంది నాయకుల రాజకీయ భవిష్యత్తు గురించి ఈ మధ్య కాలంలో చర్చలు ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన అనేక వార్తలు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కొంత సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఆయనకు టిఆర్ఎస్ పార్టీలో ఏ పదవి దక్కడం లేదని ప్రభుత్వంలో కూడా ఆయనకు పదవి దక్కడం కష్టంగా ఉందని అంటున్నారు. కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఈ మధ్యకాలంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలకు సంబంధించి ఎవరికీ పూర్తి స్థాయిలో పట్టు దక్కకుండా చేస్తున్నారని అంటున్నారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నం చేయడంతోనే ఆయనకు ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే సూచనలు ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి. రాజకీయంగా కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కొంతమందిని కలుపుకొని వెళ్లే విషయంలో వెనకడుగు వేయడంతో కొన్ని ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో వస్తున్నాయి. కీలక నాయకులతో ఆయన సంబంధాలు కూడా కోల్పోయారు అని ఆరోపణలు వినబడుతున్నాయి.

భవిష్యత్తు పరిస్థితులను సీఎం కేసీఆర్ ముందుగా అంచనా వేసి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో జాగ్రత్త పడుతున్నారని అయితే ఖమ్మం జిల్లా నుంచి కీలకమైన కమ్మ సామాజిక వర్గం ఎంపీ నామా నాగేశ్వరరావు అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యం లో తుమ్మల నాగేశ్వరరావు అవసరం లేదు అని ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మరి భవిష్యత్తులో తుమ్మల నాగేశ్వరరావు ఏ విధంగా రాజకీయం చేయబోతున్నారు... ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి అనేక చర్చలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs