అభివృద్ధి విభాగంలో భాగంగా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను ప్రధానం చేశారు.  స్వచ్ఛ్ సర్వేక్షణ్, 2021 జాబితాలో అగ్రభాగాన నిలిచిన 10 నగరాల్లో ఇండోర్, సూరత్, విజయవాడ, నవీ ముంబై, పుణే, రాయ్‌పూర్, భోపాల్, వడోదర, విశాఖపట్నం, అహ్మదాబాద్ ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో పాల్గొన్న దాదాపు 4,320 నగరాలు, పట్టణాలు ఉన్నాయి.  ఇందులో మరోసారి తొలిస్థానాన్ని నిలుపుకున్న ఇండోర్‌ నగరం. ఈ అవార్డుల్లో  విజయవాడకు 3వ ర్యాంకు, విశాఖపట్నంకు 9వ ర్యాంకు,
గ్రేటర్‌ హైదరాబాద్ నగరానికి జాతీయ స్థాయిలో 13 ర్యాంకు వచ్చాయి.  పదిలక్షల పైగా జనాభా ఉన్న నగరాల్లో
1వ ర్యాంకులో ఇండోర్‌, 3వ ర్యాంకులో విజయవాడ, 9వ ర్యాంకులో విశాఖపట్నం, 13వ ర్యాంకులో హైదరాబాద్‌ లు నిలిచాయి. అలాగే లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో 3వ ర్యాంకులో నిలిచిన తిరుపతి నిలిచింది.
50వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో దక్షిణాదిలో తొలి ర్యాంకు సాధించిన సిరిసిల్ల, రెండవ ర్యాంకులో సిద్దిపేట.

 
5వ ర్యాంకులో కందుకూర్‌, 8వ ర్యాంకులో పులివెందుల, 10వ ర్యాంకులో పలమనేరు, 12వ ర్యాంకులో సత్తెనపల్లి, 13లో తాడేపల్లి, 14లో బొబ్బిలి, 15లో మండపేట, 16లో వికారాబాద్‌, 17లో కావలి, 19లో పుత్తూరు, 20వ ర్యాంకులో బెల్లంపల్లిలు నిలిచాయి.  50 వేలలోపు జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో నిజాంపేట, మేడ్చల్‌, ఫీర్జాదిగూడ, శంషాబాద్‌, పెద్దాపురం, రామచంద్రాపురం, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఇల్లందులు నిలిచాయి.  25వేల లోపు జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో  ఘట్‌కేసర్‌, దమ్మాయిగూడ, హుస్నాబాద్‌, కొత్తపల్లి, మంథని, పోచారం, తూఫ్రాన్‌, రాయికల్‌, నెల్లిమర్ల, చిట్యాల, ఆత్మకూర్‌, గుండ్లపోచంపల్లి, పోచంపల్లిలు నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అన్ని విభాగాల్లో కలిపి లక్షకు పైగా జనాభా విభాగంలో అగ్రభాగాన నిలిచిన 25 నగరాల్లో ఇండోర్‌ తొలి స్థానంలో నిలవగా విజయవాడ 3వ స్థానంలో, తిరుపతి 7వ స్థానంలో, విశాఖపట్నం 18వ స్థానంలో, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రభాగాన నిలిచిన 25 జిల్లాల్లో 6వ స్థానంలో నిలిచిన హైదరాబాద్‌, 9వ స్థానంలో విశాఖపట్నం, 22వ స్థానంలో నిలిచిన కృష్ణా, వందకు పైగా అర్బన్‌ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల జాబితాలో 5వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌, 10 స్థానంలో నిలిచిన తెలంగాణ.


 కంటోన్మెంట్‌ విభాగంలో 7వ స్థానంలో నిలిచిన సికింద్రాబాద్‌,  సఫాయి మిత్రా సురక్ష కింద.. 10 లక్షల జనాభా కేటగిరిలో తొలి ర్యాంకు రావడంతో పాటు పది కోట్ల రూపాయలు గెలుపొందిన నెల్లూరు నగరం. స్మార్ట్‌ సిటీ విభాగంలో... తిరుపతికి 3 లక్షల జనాభా కేటగిరిలో తొలి ర్యాంకు, సఫాయి మిత్ర సురక్ష ఛాలంజ్‌లో దేశంలో 2వ స్థానం, రెండు కోట్ల రూపాయల బహుమతి, 3 స్టార్‌ గార్బేజ్‌ ఫ్రీ ర్యాంకింగ్‌లో అవార్డు. పుంగనూరు పురపాలక సంఘానికి సౌత్‌ జోన్‌లో తొలి ర్యాంకు జాతీయ అవార్డు. విజయవాడ నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్న మేయర్‌, కమిషనర్‌ గతంలో 4వ స్థానంలో ఉన్న విజయవాడ ఇప్పుడు 3వ స్థానంలో నిలిచిందన్న అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: