అధికార వైసీపీకి ఏపీలోని 13 జిల్లాల్లో పూర్తిగా బలం ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీదే ఆధిక్యం. ఆ ఆధిక్యం ఇప్పటికీ ఉందనే చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో పూర్తిగా అన్నీ జిల్లాల్లో వైసీపీనే సత్తా చాటింది. కాకపోతే తాజాగా జరిగిన మినీ మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కాస్త సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.

అలా అని వైసీపీ ఆధిక్యం ఏమి తగ్గలేదు. వైసీపీ లీడ్ ఉంది కానీ....కాస్త బలం తగ్గినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఐదు జిల్లాల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలని బట్టి చూస్తే...ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం కొంచెం తగ్గినట్లు కనబడుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ కాస్త పుంజుకున్నట్లే కనిపిస్తోంది.

ఎందుకంటే ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే పరిషత్ ఎన్నికల్లో కాస్త పోటీ ఇచ్చింది. ఇటు గుంటూరులో దాచేపల్లి మున్సిపాలిటీలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. అలాగే గుంటూరు కార్పొరేషన్‌లో 6వ డివిజన్‌కు జరిగిన ఉపఎన్నికలో టీడీపీ గెలిచింది. ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ డివిజన్‌లో వైసీపీ గెలిచింది. ఇక కృష్ణా విషయానికొస్తే కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో దాదాపు వైసీపీకి చెక్ పెట్టినంత పనిచేసింది. పరిషత్ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చింది.

ఇటు పశ్చిమ గోదావరిలో ఆకివీడు మున్సిపాలిటీలో వైసీపీకి, టీడీపీ-జనసేనలు మంచి పోటీ ఇచ్చాయి. అలాగే తూర్పు గోదావరిలో పరిషత్ ఎన్నికల్లో వైసీపీని, టీడీపీ-జనసేనలు డామినేట్ చేశాయి. అంటే ఈ ఐదు జిల్లాల్లో వైసీపీ హవాని టీడీపీ తగ్గిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక జనసేన కలిస్తే ఇంకా దెబ్బపడుతుందని అర్ధమవుతుంది. మొత్తానికైతే ఈ ఐదు జిల్లాల్లో కొంచెం ఫ్యాన్ స్పీడ్ స్లో అయినట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: