దేవుడు ఆడే వింత నాటకంలో మనిషి జీవితం కీలుబొమ్మ లాంటిది. అందుకే మనిషి ప్రాణాలు ఎప్పుడు పోతాయో అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. అంతా సంతోషంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతు ఉంటాయ్. క్షణాల వ్యవధిలో జరిగిన ఘటనలతో విషాదంలో మునిగి పోతూంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా బస్సు ప్రయాణం చేస్తున్న సమయంలో కిటికీ దగ్గర కూర్చోవడానికే అందరూ ఇష్టపడుతూ ఉంటారు.


 మరి కొంతమంది ఇలా ప్రయాణాలు చేస్తున్న సమయంలో చల్లగాలిని ఆస్వాదించడానికి కిటికీలోంచి చేయి బయట పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి అంటూ  హెచ్చరిస్తూ ఉంటారు పెద్దలు. కానీ కొంతమంది  ఇలా చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ ఓ యువతి ఇలా చల్ల గాలి కోసం ఏకంగా తల బయటపెట్టింది. కానీ చివరికి ప్రాణాలు కోల్పోయింది. కారులో ప్రయాణిస్తున్న యువతి చల్ల గాలి కోసం తల బయటపెట్టి విద్యుత్ స్తంభంతగిలి యువతి తలకు బలమైన గాయం అయింది. దీంతో యువతి ప్రాణాలు కోల్పోయింది.


 ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.. ఎనిమిది మంది స్నేహితులు కలిసి పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం నుంచి కారులో శనివారం మారేడ్పల్లి విహార యాత్రకు బయలుదేరారు.ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్తున్న సమయంలో లోహిత్ రాణి అనే యువతి చల్ల గాలి కోసం కార్ కిటికీ తెరిచింది. ఇంతలో తల బయటకు పెట్టింది. అయితే అంతలో ఇక కారు రోడ్డు అంచుకు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఆమె తల బలంగా తగిలింది. దీంతో తీవ్ర గాయమైంది. అయితే స్నేహితులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: