కొద్ది రోజులుగా కేసీఆర్ తీరు చూస్తే మ‌ళ్లీ జాతీయ రాజ‌కీయాల వైపు చూస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాటంలో చ‌నిపోయిన కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి 3 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇలాంటి చ‌ర్య వెనుక పెద్ద రాజ‌కీయ వ్యూహం ఉంటుంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌ల మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న రైతుల‌కు మ‌ద్ధ‌తుగా వాళ్ల‌తో క‌లిసి పోరాడుతామ‌ని అవ‌స‌రం అయితే ఆ నిర‌స‌న‌కు నాయ‌కత్వం వ‌హిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. దీని ద్వారా కేంద్రానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న రైతుల మ‌ద్ధ‌తు తీసుకోవాల‌ని యోచించారు.


   ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది. దీంతో కొత్త డిమాండ్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డ‌మే కాకుండా రైతు ఉద్య‌మంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. అదే విధంగా నేడు ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్ద‌ల‌తో మాట్లాడనున్నాడు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా థ‌ర్డ్ ఫ్రంట్ ముందుకు తీసుకురావాల‌ని కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.


   కాంగ్రెస్‌ను క‌లుపుకుని వెళ్ల‌కుండా  బీజేపీ, కాంగ్రెస్ ఏతర పార్టీలు త‌న‌తో క‌లిసి రావాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో గ‌తంలో లాగా రాష్ట్రాల సీఎంల‌ను క‌లిసి మాట్లాడే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో కూడా ముందుకు న‌డిచే అవకాశాలు ఉన్నాయి. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ను న‌మ్మి ఆయ‌న వెంట న‌డిచేందుకు మిగ‌తా పార్టీలు ముందుకు రాక‌పోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే, గ‌త ఎన్నిక‌ల కంటే ఈ సారి బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయనేది స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇలాంటి సమ‌యంలో గ‌నుక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా మూడో కూట‌మి ఏర్ప‌డితే ఎంతో కొంత ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేశ‌కులు అంచ‌నా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: