తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో కొంతమంది ఆయనకు సహకరించాల్సిన అవసరం ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత వరకు సహకరిస్తారు అనేదానిపై చాలామంది చాలా లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వెళితే కొంతమందిని కలుపుకొని వెళ్లే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు అనే మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆయన కలుపుకుని వెళ్లే అవకాశం ఉందని త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ తో ఈ అంశానికి సంబంధించి భేటీ జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

అయితే సీఎం కేసీఆర్ దారిలోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వస్తారా లేదా అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ తో అవసరం ఎక్కువగా ఉంది అనే వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా కొంతమంది చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం ఏమిటంటే దానిపై క్లారిటీ లేకపోయినా కొంతమంది అనవసర ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి ప్రస్తుతం కేంద్ర అంత అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి వెళ్లే అవకాశం లేకపోవచ్చు అని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో కలిసి వెళ్లి జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెడితే అనవసరంగా జగన్ నష్టపోయే అవకాశం ఉంటుందని రాష్ట్రంలో కూడా కొన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని కాబట్టి సీఎం కేసీఆర్ ఒకవేళ జగన్ తో మాట్లాడిన సరే జగన్ కు కూడా పెద్దగా దృష్టి పెట్టే అవకాశం ఉండక పోవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: