తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనకు ఎంత వరకు సహకరిస్తారు ఏంటనే దానిపై చాలామంది చాలా లెక్కలు వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం విషయంలో చాలా సీరియస్ గా ఉండటమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అలాగే కేంద్ర హోం మంత్రి ని గట్టిగా టార్గెట్ చేసే ఆరోపణలు చేసే పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మమతా బెనర్జీకి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా జాతీయ స్థాయిలో ఆమె ఎటువంటి పాత్ర పోషిస్తారనే దాని పైనే చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమెను కలుపుకుని వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా భారతీయ జనతా పార్టీని కలుపుకొని రాజకీయం చేసే అవకాశం ఉంటే మాత్రం మమతా బెనర్జీ కచ్చితంగా కేసీఆర్ నీ పక్కన పెట్టే అవకాశం ఉంది అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. కొన్ని కీలక అంశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఒక అవగాహనతో ముందుకు వెళితే మమతా బెనర్జీని కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అలా కాకుండా మమతా బెనర్జీ కాంగ్రెస్ కి దగ్గర కాకుండా ఉండడానికి సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కాబట్టి మమతా బెనర్జీ ముందుకు రాకపోవచ్చు అని అంటున్నారు. ఇక కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ముందుగానే మమతా బెనర్జీ క్లారిటీ ఇవ్వడమే కాకుండా తనతో కలిసి వచ్చే వారి విషయంలో ఒక నమ్మకమైన హామీ మమతా బెనర్జీకి ఇస్తే మాత్రం ఆమె సీఎం కేసీఆర్ తో కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: