తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశం నిర్వహిస్తారు లేదా అనే దానిపై ఇపుడు చర్చలు మొదలయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విషయంలో చాలా సీరియస్ గా ఉండటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సహకరించి వచ్చే ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో భారీగా పార్లమెంటు స్థానాలు గెలుచుకునే విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడులో కనీసం 35 నుంచి 40 స్థానాలు గెలవాలని స్టాలిన్ పట్టుదలగా పెట్టుకున్నారని ఈ నేపథ్యంలోనే తన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలు తీసుకుని ఇప్పటినుంచి ముందుకు వెళుతున్నారని అంటున్నారు. అయితే జాతీయ స్థాయి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని కాదని సీఎం కేసీఆర్ తో స్టాలిన్ కలిసి వస్తారా లేదా అనే దానిపైనే ఆసక్తికర చర్చలు ఉన్నాయి. సీఎం కెసిఆర్ కొన్ని కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు అని అనుమానాలు చాలా మందికి ఉంటాయి. కాబట్టి స్టాలిన్ సీఎం కేసీఆర్ ను ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది ఏంటనే దానిపై స్పష్టత లేదు.

స్టాలిన్ కాంగ్రెస్ పార్టీని కాదని సీఎం కేసీఆర్ ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన సరే వచ్చే అవకాశం లేదని కాబట్టి సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి తో సమావేశం నిర్వహించిన సరే అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవచ్చు అని అంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి కొన్ని కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సీఎం కేసీఆర్ చెన్నై వెళ్ళిన స్టాలిన్ దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవచ్చు అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: