తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో సొంత రాష్ట్రంలో ఎంత వరకు ముందుకు వెళతారు ఏంటనే దానిపై చర్చలు ఉన్నాయి. పరిపాలన విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడమే కాకుండా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ఎదుర్కొనే విషయంలో చాలా జాగ్రత్తగా రాజకీయం చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కీలక అంశాల విషయంలో భారతీయ జనతా పార్టీని ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు అనే భావన కూడా చాలామందిలో ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో అనుకున్నది సాధిస్తున్న సరే కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం ఆయన వెనక అడుగు వేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ని కట్టడి చేసే విషయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను సమర్థవంతంగా ముందుకు నడిపించ లేకపోతున్నారు అని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల కాలంలో కొన్ని కీలక విజయాలు సాధించి తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఆయన కొన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీ ని కట్టడి చేయకపోవడం తో బీజేపీ నేతలు చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.

అయితే ఇక్కడ కీలకాంశం ఏంటి అంటే పరిపాలన విషయంలో పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ ఏ మాత్రం లైట్ తీసుకున్న సరే భారతీయ జనతా పార్టీ కచ్చితంగా తెలంగాణ లో పాగా వేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అనే మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది కానీ తెలంగాణలో రాజకీయాన్ని మంత్రి కేటీఆర్ హరీష్ రావుకు అప్పగించి ఆయన జాతీయ స్థాయి మీద దృష్టి పెడితే మాత్రం లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts