తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో కొన్ని కొన్ని కీలకాంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఆయన పార్టీని అలాగే ప్రభుత్వాన్ని ఎంతవరకు సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారు భారతీయ జనతా పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు సమర్థవంతంగా రాష్ట్రంలో ఎదుర్కోవాలి అనేదానిపై నేను చాలా వరకు కూడా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ని సీఎం కేసీఆర్ ఎదుర్కోనకపోతే మాత్రం కచ్చితంగా రాష్ట్రంలో అధికారం కోల్పోయే అవకాశం పుష్కలంగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ వ చ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవక పోతే మాత్రం టీఆర్ఎస్ పార్టీని కచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే ధర్మపురి అరవింద్ సహా కొంతమంది కీలక నేతలు గట్టిగా కష్టపడుతూ అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ 2018లో భారతీయ జనతా పార్టీతో విభేదించి తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేసిన తప్పుని సీఎం కేసీఆర్ తెలంగాణలో చేయకూడదు అనేది చాలా మంది చెప్పే మాట.

చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న ప్రత్యర్థి వదిలేసి కేంద్రంలో ఉన్న ప్రత్యర్థి  మీద పోరాటం చేయడంతో రాష్ట్రంలో సీఎం జగన్ అప్పట్లో ప్రతిపక్ష నేతగా పూర్తి స్థాయిలో బలపడ్డారు. ఎప్పుడో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలాగే చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని కీలక అంశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు లాగా గుడ్డిగా ముందుకు వెళ్లకుండా జాగ్రత్త గా రాజకీయం చేయాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: