ఎవరెన్ని చెప్పినా సరే జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్ళాలి అంటే కచ్చితంగా కొంతమంది సహకారం ఉండాల్సిన అవసరం ఉంది అనే మాట వాస్తవం. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవసరం సీఎం కేసీఆర్ కు ఎక్కువగా ఉంటుందనే వాళ్లు కూడా ఉన్నారు. చంద్రబాబు బలహీనంగా ఉన్నా సరే జాతీయస్థాయి రాజకీయాల మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడమే కాకుండా జాతీయ స్థాయి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. జాతీయస్థాయి రాజకీయాల మీద చంద్రబాబు నాయుడుకి పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల విషయంలో ఆయన సహకారం అవసరమని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ తో సీఎం కేసీఆర్ కలిసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీని కాదని చంద్రబాబు నాయుడు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్ లో జాయిన్ అవుతారా లేదా అనేది చర్చ. చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీతో దూరం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీతో దగ్గరి సంబంధాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కీలకంగా మారిన అంశం.

చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించే వ్యక్తి కావడంతో సీఎం కేసీఆర్ ఆయన సలహాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు గా కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో కలిసి అవకాశం ఉండకపోవచ్చని చంద్రబాబు అలాగే సీఎం జగన్ ఇద్దరూ కూడా దగ్గరగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు కలిసి ముగ్గురు కలిసి ఉన్నారు అని అభిప్రాయం బలపడుతోంది కాబట్టి చంద్రబాబు దూరంగా ఉండే అవకాశం ఉందనే వాళ్లు కూడా కొంతమంది ఉన్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: