తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఆయనతో కొంతమంది కలుస్తారా లేదా అనే దానిపై చాలా వరకు కూడా లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధానంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి విషయంలో సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు ఏంటనే దానిపై ఆసక్తి కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సమాజ్వాదీ పార్టీతో కలిసి ముందుకు వెళితే మాత్రం సీఎం కేసీఆర్ తో కలిసే అవకాశం ఉంటుందని అలా కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీతో ముందుకు వెళితే మాత్రం కచ్చితంగా సీఎం కేసీఆర్ ని పక్కన పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో దూకుడుగా ముందుకు వెళ్లే నాయకుడు కావడంతో వాళ్ళిద్దరు ని ఎలా ఒప్పిస్తారు అనేదానిపై చాలామంది చాలా లెక్కలు వేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంటారనే వాళ్లు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఫెడరల్ ఫ్రంట్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంత మంది ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ ఆయనను పూర్తిగా భారతీయ జనతా పార్టీకి దూరం చేస్తే మాత్రం ఫెడరల్ ఫ్రంట్  కలిసి వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఇక మాయావతి కాంగ్రెస్ పార్టీతో దగ్గరగానే ఉంటారనే విషయం స్పష్టంగా తెలుసు. మాయావతి కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి గతంలో దూకుడుగా ముందుకు ఉండేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె భారతీయ జనతా పార్టీతో యుద్ధం చేసే పరిస్థితి లేకపోవడంతో సీఎం కేసీఆర్ ఎంతవరకు ఆమెను ఒప్పిస్తారు ఏంటనే దానిపై చాలా అనుమానాలున్నాయి. మరి భవిష్యత్తులో మాయావతి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందట అరవింద్ కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ తో కలుస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: