తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో దృష్టి పెడుతున్న నేపథ్యంలో దక్షిణాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్న రెండు పార్టీల అధినేతలను దగ్గర చేసుకోవడం అనేది కీలకాంశం. చంద్రబాబు లేదా వైయస్ జగన్ తో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా రాజకీయం చేసే వీరిద్దరిని కలుపుతూనే వెళితే మంచి ఫలితం ఉంటుంది కానీ వీళ్ళు ఇద్దరు కలిసి సీఎం కేసీఆర్ తో పని చేస్తారా అనేది ప్రధాన ప్రశ్న. అయితే సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో సీఎం జగన్ తో కలిసి ఉంటారా లేదా అనే దానిపై చాలా అనుమానాలున్నాయి.

వాస్తవానికి జాతీయస్థాయి రాజకీయాల మీద సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలి అంటే చంద్రబాబు అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో చూస్తే చంద్రబాబును కలుపుకుని వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో ఆయన ముందు నుంచి సన్నిహితంగానే ఉంటారు కాబట్టి జగన్ తో కలిసి వెళ్తారా లేదా అనేది కూడా చూడాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు సీఎం జగన్ కు కొన్ని విషయాల్లో అవసరం ఉంటారని కాబట్టి జగన్ సీఎం కేసీఆర్ తో కలిసి వెళ్లడానికి ఏమాత్రం ఆలోచించక పోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే చంద్రబాబునాయుడు సీఎం కేసీఆర్ తో కలిసి వెళ్లే విషయంలో చాలా ఆలోచించుకునే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీతో దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయన కేసీఆర్తో కలవక పోవచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇద్దరితో కేసీఆర్ ఇప్పుడు అవసరం ఉంది అనుకుంటే మాత్రం కచ్చితంగా చంద్రబాబు ఎంచుకుంటారా జగన్ను ఎంచుకుంటారా అనేది తెలియాలి. జాతీయస్థాయి రాజకీయాలు కాబట్టి దాదాపుగా చంద్రబాబు ఎంచుకునే అవకాశం ఉంటుందని అయితే జాతీయ స్థాయి రాజకీయాల మీద తనకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో బలంగా ఉన్న జగన్ ను ఎంచుకునే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: