చంద్రబాబుకు అలుపు లేదా. ఆయన ఇంకానా రాజకీయాల్లో. ఇలా ఒక వైపు చర్చ అయితే ఎపుడూ ఉంటుంది. చంద్రబాబు ఏడు పదులు వయసు దాటిన వారు. పైగా ఆయన ఏనాడో స్టూడెంట్ రాజకీయాల నుంచి రంగంలో ఉన్నారు. ఇక ఏ రోజూ కూడా వెనక్కి తగ్గలేదు. తన వ్యూహాలకు ఎపుడూ పవర్ పోలేదు అని చాటుకుంటూనే ఉన్నారు.

అలాంటి చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత ఆయన పార్టీలో నిస్తేజం ఆవహించిన మాట వాస్తవం. ఇక వరసబెట్టి ఈ ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అనేక ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడింది. దీంతో చంద్రబాబు రిటైర్ అయిపోవడమే బెటర్ అంటూ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు హాట్ కామెంట్స్ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం పట్టుదలకు మారుపేరుగా అలా ముందుకు సాగుతూనే ఉన్నారు.

ఆయన ఆశలన్నీ కూడా 2024 ఎన్నికల మీద పెట్టుకున్నారు. ఎలాగోలా గెలిచి తీరాలన్నది బాబు ఆలోచన. 2024 ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగానే చూడాలి. మరో రెండున్నరేళ్ళలో జరిగే ఈ ఎన్నికల్లో టీడీపీ కనుక‌ ఓడితే మాత్రం కచ్చితంగా బాబు రిటైర్ అవుతారు అంటున్నారు. అది అనివార్యం కూడా. ఎందుకంటే ప్రజలు ఆదరించనపుడు గమ్మున ఇంటిపట్టున ఉండడమే మంచిది అని ఎవరైనా అంటారు.

అయితే చంద్రబాబు మాత్రం తన రిటైర్మెంట్ కి రాష్ట్ర భవిష్యత్తుకు కూ ముడి పెట్టేస్తున్నారు. వచ్చే ఎన్నికలు తనకే కాదు, రాష్ట్ర ఫ్యూచర్ కి కూడా అవసరం అని ఆయన చెప్పనున్నారు. ఏపీ బాగుపడాలీ అంటే తనకే ఒక చాన్స్ ఇవ్వారని బాబు కోరబోతున్నారట. ఒక విధంగా  ఆయన సెంటిమెంట్ ని రంగరించి అతి పెద్ద  అస్త్రం ప్రయోగించబోతున్నారు అన్న మాట. మరి బాబు కావాలీ అని జనం కోరుకుంటే ఆయన ఇక ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రశ్నే లేదు. అలా కాకుండా భిన్నంగా జరిగితే ఇక వేరే చెప్పేది లేదు. మొత్తానికి చూస్తే చంద్రబాబు రిటైర్మెంట్ అన్నది జనం చేతిలోనే ఉంది అనే చెప్పాలేమో అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: