కొవిన్ పోర్టల్ లో కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని కల్పించింది. ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడా..? లేదా..? అనేది ఆ వ్యక్తి ఫోన్ నెంబర్, పేరుతో సర్వీస్ ప్రొవైడర్లు తెలుసుకోవచ్చు. సదరు వ్యక్తి అనుమతితో అతను చెప్పే ఓటీపీతో మాత్రమే సర్వీస్ ప్రొవైడర్లు వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ట్రావెల్ ఏజెన్సీలు, కార్యాలయాలు, యాజమాన్యాలు, ఐఆర్ సీటీసీ లాంటి ప్రభుత్వ సంస్థలు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.

మరోవైపు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా వేసుకున్నవారు.. ఈ నెల 30నుంచి తమ దేశంలోకి రావొచ్చని కెనడా ప్రకటించింది. కొవాగ్జిన్ తో పాటు సినోఫార్మ్, సీఓవాక్ వ్యాక్సిన్లనూ కెనడా గుర్తించనుంది. వీటీతో పాటు.. డబ్ల్యూహెచ్ ఓ ఆమోదం పొందిన టీకాలు వేసుకున్న ప్రయాణీకులను ఈ నెలాఖరు నుంచి తమ దేశంలోకి అనుతించనున్నట్టు ఆ దేశం పేర్కొంది. కరోనా విలయం తర్వాత.. విదేశీయులు తమ దేశంలోకి రావడానికి ఆంక్షలు పెట్టింది కెనడా ప్రభుత్వం.

అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ డోసులు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా బూస్టర్ డోసులకు అనుమతి ఇచ్చింది. గతంలో 65ఏళ్లు పైబడిన వారు.. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారికే బూస్టర్ డోసులు అందించింది. దీంతో కోట్లాది మంది లబ్ది పొందనున్నారు. శీతాకాలంలో కరోనా వ్యాప్తి పెరుగుతుందన్న హెచ్చరికల కారణంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆస్ట్రేలియాలో అయితే యాంటీ వ్యాక్సినేషన్ నిరసనలు ఊపందుకున్నాయి. కోవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. వైరస్ పేరుతో ప్రభుత్వం వ్యక్తుల స్వేచ్ఛను హరించడమేనని ఆరోపిస్తున్నారు. మెల్ బోర్న్, సిడ్నీ, పెర్త్, బ్రిస్బేన్ తదితర నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ కు మద్ధతుగా కొంతమంది ర్యాలీలు చేపడుతున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కొవిన్ పోర్టల్ ద్వారా సరికొత్త సేవలను అందిస్తోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: