పేరుకు అధికార పార్టీ గానీ...అంతగా అధికారాలు మాత్రం ఉండటం లేదని, తమ మాట ఎక్కువగా చెల్లుబాటు అయ్యే అవకాశాలు తక్కువని, అలాగే వచ్చే నిధులు తక్కువ, తిట్లు ఎక్కువ అన్నట్లుగా పరిస్తితి ఉందని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది...దానికి తోడు టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరిని లెక్క పెట్టుకుంటే..156 మంది...కానీ ఇందులో చాలామందికి ఎమ్మెల్యేలమేనా అనే డౌట్ కూడా వస్తుందట.

అసలు ఏది తమ చేతుల్లో ఉండటం లేదని ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారట. గతంలో పథకాలు గానీ, ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏమన్నా చేయాలన్న కూడా ఎమ్మెల్యేలే చూసుకునేవారు. కానీ ఇప్పుడు అంతా వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది చేతుల్లోనే ఉన్నాయి. ఇక వారే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో వారథిగా ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు పని ఏంటంటే? ఏమో పాపం వారికే సరిగ్గా క్లారిటీ ఉండటం లేదట.

పైగా ఎమ్మెల్యేలకు జగన్‌ని కలిసే అవకాశం చాలా అరుదుగా వస్తుందని, అలాగే ప్రభుత్వం నుంచి నియోజకవర్గాల అభివృద్ధికి వచ్చే నిధుల కూడా తక్కువే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగో ప్రభుత్వం అప్పుల్లో ఉంది..దీంతో నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం కష్టమైపోయింది. ఏదో ప్రభుత్వం నుంచి జరిగే కొన్ని పనులు అంటే...నాడు-నేడు, జగనన్న కాలనీలు ఇలాంటివి మాత్రం జరుగుతున్నాయి. ప్రత్యేకంగా నియోజకవర్గాలకు నిధులు వచ్చే పరిస్తితి మాత్రం చాలా తక్కువని అంటున్నారు.

అయితే ఇదే పరిస్తితి వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే ఇబ్బంది అవుతుందని పలువురు ఎమ్మెల్యేలు కంగారు పడుతున్నారట. పైగా ప్రజలు రోజురోజుకూ అనేక సమస్యలని తమ దృష్టికి తీసుకొస్తున్నారని, కానీ వాటికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నామనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇకనుంచైనా కాస్త నిధులు మంజూరు చేస్తే పనులు చేసి...నియోజకవర్గానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యేలు అంతర్గతంగా కోరుతున్నారట. మరి చూడాలి ఎమ్మెల్యేలకు న్యాయం జరుగుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: