దాదాపు దశాబ్ద కాలంగా దేశ రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ ప్రపంచానికి తెలుసు.పార్లమెంటరీ,  పార్లమెంటేతరా మద్దతు పుష్కలంగా సంపాదించుకోవడానికి మోడీ అనుసరించిన వ్యూహాలు,సాగించిన ప్రచారం,వేషధారణ, హావభావాలు మొత్తం లెక్కిస్తే గిన్నిస్ రికార్డులో కాకపోయినా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోనైనా స్థానం దక్కుతుంది.దాదాపు రెండు దశాబ్దాలుగా కరుడుకట్టిన హింసాత్మక దాదాపు దశాబ్ద కాలంగా దేశ రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ ప్రపంచానికి తెలుసు.పార్లమెంటరీ,  పార్లమెంటేతరా మద్దతు పుష్కలంగా సంపాదించుకోవడానికి మోడీ అనుసరించిన వ్యూహాలు,సాగించిన ప్రచారం,వేషధారణ, హావభావాలు మొత్తం లెక్కిస్తే గిన్నిస్ రికార్డులో కాకపోయినా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోనైనా స్థానం నుండి దక్కుతుంది.దాదాపు రెండు దశాబ్దాలుగా కరుడుకట్టిన హింసాత్మక హైందవొన్మాద రాజకీయాలకు కూడా మోడీ ప్రతీకగా నిలిచాడు.పౌర సమాజ మనోభావాలను ఒంటిచేత్తో ప్రభావితం చేయగల శక్తి తనకు ఉందని దేశాన్ని,ప్రపంచాన్ని నమ్మించాడు.అటువంటి సంఘపరివార్ ఛాందసవాదుల కు, ఇటు మార్కెట్ ఛాందసవాదుల కు ముద్దుబిడ్డ గా మారాడు. అటువంటి ప్రధాని హఠాత్తుగా వివాదాస్పద వ్యవసాయక చట్టాల విషయంలో ప్లేటు ఫిరాయించడం కనీసం సంస్కరణల పేరుతో జాతీయ సంపదపై కన్నేసిన పెద్దలకు మింగుడుపడని వ్యవహారంగా మారింది.

ఇదే ప్రధాని కనీసం డజను సార్లు రైతాంగం ప్రతిపక్షాల ప్రోద్బలంతో, విచ్చిన్నకర చరిత్ర తోడ్పాటుతో దారితప్పిన కొద్దిమంది సాగిస్తున్న ఆందోళన అని రైతు ఉద్యమాన్ని కొట్టిపారేశారు.ఏడాది పాటు ఢిల్లీ దిగ్బంధనం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన,ప్రధాని మాత్రం అసలు అన్ని వేల మంది సరిహద్దుల్లో కూర్చున్న విషయమే కనిపించినట్లు వ్యవహరించారు.రైతు ఉద్యమం పై ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని, దమనకాండను ఏకంగా ఐక్యరాజ్యసమితి మొదలు అంతర్జాతీయ పర్యావరణ కార్యకర్తలు, మానవ హక్కుల ఉద్యమకారులు ఖండించినా, అంతర్జాతీయ వేదికలపై పలుసార్లు చుక్కెదురైనా మోడీ చలించలేదు. అటువంటి ప్రధాని గురుపూర్ణిమ సందర్బంగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నల్ల చట్టాలుగా రైతులు చేస్తున్న ఈ చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: