సైన్యాన్ని ఆధునికీకరిస్తున్నామని మోడీ సర్కారు చెప్పుకుంటోంది. ఇప్పటికే సైన్యానికి సంబంధించిన అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని.. ఇప్పుడు మరింత ఆధునిక ఆయుధాలతో సైన్యం ఆత్మవిశ్వాసం పెంచుతున్నామని మోడీ సర్కారు చెబుతోంది. తాజాగా తూర్పు సముద్ర తీర పరిరక్షణ కోసం యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం విధుల్లోకి చేరిన సందర్భంగా ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం రాకతో సైన్యంలో ఆత్మనిర్భరత పెరుగుతోందన్నారు మోదీ.


ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నాన్ని పూర్తి స్వదేశీ సాంకేతికతో తయారు చేశామని.. ఇది నౌకాదళానికి మరింత శక్తి ఇస్తుందని ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. సైన్యాన్ని ఆధునికీకరణ మరింత వేగంగా ముందుకు సాగుతోందని మోడీ అన్నారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను ముంబయిలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేశారు. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం  మోహరింపు ప్రాధాన్యత సంతరించుకుంది.


ఈ ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం ద్వారా బ్రహ్మోస్‌ సహా అనేక అధునాతన క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంది. అందుకే ఈ యుద్ధ నౌక ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ చైనాపై విమర్శలు చేశారు. దేశాల ప్రాదేశిక సముద్ర జలాల పరిరక్షణ కోసం రూపొందించిన చట్టాలను కొన్ని దేశాలు తుంగలో తొక్కుతున్నాయని రాజ్‌నాథ్‌ సింగ్ విమర్శించారు. చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కొన్ని దేశాలు బాధ్యతారాహిత్య దేశాలుగా వర్ణించారు.


1982-ఐరాస కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టం అన్‌క్లాజ్‌ వచ్చిందని గుర్తు చేసిన రాజ్‌నాథ్‌ సింగ్ దేశాల ప్రాదేశిక సముద్ర జలాల పరిరక్షణ కోసం సముద్రంలో ఈ నిబంధనలను అనుసరించాలని కోరారు. కానీ  కొన్ని దేశాలు.. బాధ్యతారాహిత్య దేశాలుగా మిగిలిపోతున్నాయని.. అవి తమ సంకుచిత, పక్షపాత ప్రయోజనాలు, ఆధిపత్య ధోరణులతో అంతర్జాతీయ చట్టాలకు కొత్త అర్థాలు చెబుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: