కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం పట్ల కపట ప్రేమను ప్రకటిస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి వరి ధాన్యం కొనుగోలు విషయంలో పరస్పర ఆరోపణలు, ధర్నాలకు పాల్పడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇవాళ వర్షాకాల పంట పండించిన తర్వాత ధాన్యం అమ్మకం కోసము కల్లాలు, రోడ్లమీద, ఖాళీ స్థలాల్లో రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కానీ తెలియదు.
 కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నిజాంబాద్ జిల్లా లోని కొన్ని ప్రాంతాలలో వాహనాలు పైనుండి పోయి కొందరు చనిపోగా మరి కొందరు రైతులు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆవేదన చెంది చనిపోయిన సంఘటనలు మనం వింటున్నాం. పత్రికల్లో చూస్తున్నాం. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం గానీ తక్షణ చర్యలు చేపట్టడం గానీ జరగక పోవడం పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.


    ఉస్మానియా జేఏసీ నాయకుల ప్రతిస్పందన:
     ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమానికి కేంద్ర బిందువైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల బలిదానాలు, విద్యార్థుల భాగస్వామ్యం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దని జేఏసీ నాయకులు అన్నారు. ఉస్మానియా విద్యార్థుల ఉద్యమాలను, ప్రజా సంఘాల పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ తన వల్లనే  సాకారం అయిందని ముఖ్యమంత్రి పదే పదే అనడాన్ని ఉస్మానియా జేఏసీ నాయకులు ఘాటుగా విమర్శిస్తున్నారు.
     ఉద్యమాల ద్వారా తెలంగాణ సాకారమైన తర్వాత ధర్నాలు అవసరం లేదని ధర్నా చౌక్ నుమూసిన ముఖ్యమంత్రి విద్యార్థుల, నిరుద్యోగుల, వివిధ రకాల ఉద్యోగుల, ప్రజాసంఘాల ఉద్యమాలు నిర్వహించుకోవడానికి పోలీసులు ప్రభుత్వం అనుమతించని కారణంగా అనేక ఇబ్బందులకు గురియైనామని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే ధర్నాచౌక్లో రైతుల సమస్యల పేరుచెప్పి ధర్నాకు పాల్పడడం రెండు నాలుకల ధోరణి అని విద్యార్థులు ధర్నా చేస్తే నిరంకుశంగా  అణచివేస్తు న్నారని ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: