తెలంగాణ లో ఇటీవల ఎమ్మెల్యే ల కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ రాగా వీటిని త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేయ‌నున్నారు. అలాగే గవర్నర్ కోటాలో కొన్ని స్థానాలు భర్తీ చేస్తున్నారు. అసలు అక్కడ ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ లేకపోవడంతో ఎమ్మెల్సీ స్థానాలు అని అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడిపోతున్నాయి. అయితే అధికార పార్టీలో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి జంపింగ్ చేసిన నేతలు కూడా తమకు పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ కంగా జ‌రిగిన హుజూరా బాద్ ఉప ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు పార్టీలో చేర్చుకున్నారు.

క్రమంలోనే వారిలో కొంతమందికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ తాజా ఎమ్మెల్సీల భర్తీలో టీ టిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ కు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తున్నారు. అలాగే హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా పనిచేసిన పాడి కౌశిక్ రెడ్డి కి సైతం ఎమ్మెల్సీ ఇస్తున్నారు. అయితే ఎన్నో ఆశలతో పార్టీలో చేరిన, ప‌ద‌వి కోసం ఎదురు చూస్తోన్న కొంద‌రు నేత‌ల పేర్లు కూడా ప‌రిశీల‌న‌కు రాలేదు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కి సైతం షాక్ తప్పలేదు.

సీనియర్ నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు - తుమ్మల నాగేశ్వరరావు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు పరిశీలనకు రాలేదు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి ని కూడా ప్రస్తుతానికి కెసిఆర్ పట్టించుకోలేదని అంటున్నారు. పెద్దిరెడ్డి కూడా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా కు చెందిన వారే. అయితే ఇప్ప‌టికే అక్క‌డ కౌశిక్ రెడ్డి, ఎల్‌. ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వ‌డంతో అదే ప్రాంతానికి చెందిన పెద్దిరెడ్డి కి ప్ర‌స్తుతానికి ప‌ద‌వి ఇవ్వలేద‌ని .. త‌ర్వాత ఆయ‌న పేరు ప‌రిశీల‌న‌కు రావ‌చ్చ‌ని అంటున్నారు. మరి పెద్దిరెడ్డి ఎమ్మెల్సీ ఆశ‌ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి,

 

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr