తెలంగాణ కాంగ్రెస్ ని బాగు చేయడం ఎవరి వల్ల అయ్యేలా కనిపించడం లేదు. రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పార్టీలో కొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కోమటిరెడ్డి సోదరుల తో పాటు మాజీ పిసిసి అధ్యక్షుడు , నల్గొండ ఎంపీ reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. దీనికితోడు సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి కూడా రేవంత్‌ విషయంలో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. పైగా ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో పాటు డిపాజిట్ కూడా కోల్పోవడంతో రేవంత్ వ్యతిరేకులకు మంచి అస్త్రం దొరికినట్లు అయింది.

ఈ క్ర‌మంలోనే కోమ‌టి రెడ్డి రెడ్డి సోదరులు పార్టీని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా.. వారిని కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి లేదు. అలాగని వారిని బుజ్జగిస్తున్న వారు దారికి కూడా రావడం లేదు. తాజాగా రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తో కోమటిరెడ్డి సోదరుల వద్దకు రాయభ‌రం పంపినట్టు తెలుస్తోంది. వి.హనుమంతరావు భువనగిరి ఎంపీ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు మునుగోడు ఎమ్మెల్యే గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని కోరినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఇద్దరు సోదరులకు కూడా ప్రాధాన్య‌త ఇస్తామ‌ని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక కోమటిరెడ్డి సోదరులలో ఖచ్చితంగా ఒకరికి మంత్రి పదవి ఇస్తామ‌ని కూడా రేవంత్ హామీ ఇచ్చినట్లు టాక్ ?  మ‌రి ఈ రాయ‌భేరానికి కోమ‌టిరెడ్డి సోద‌రులు ఏం చెప్పార‌న్న‌ది మాత్రం తెలియ‌దు. ఏదెలా ఉన్నా కోమ‌టిరెడ్డి సోద‌రులు రేవంత్ ను ప్రెజ‌ర్ చేసి న‌ల్ల‌గొండ జిల్లా పెత్త‌నం అంతా త‌మ‌కే ఇవ్వాల‌న్న కండీష‌న్ కూడా పెట్టేలా ఉన్న‌ట్టు టాక్ ?  కోమటిరెడ్డి సోదరులు ఇప్పటికైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారో ? లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: