రాజ‌ధాని రాజ‌కీయంలో మ‌రో మ‌లుపు వ‌చ్చి ప‌డింది. త్వ‌ర‌లోనే దీనిపై ఓ నిర్ణ‌యం వ‌స్తుంద‌ని భావిస్తున్న వారికి ముఖ్యంగా టీడీపీ వ‌ర్గాల‌కు ఊహించిన ప‌రిణామం ఎదుర‌యింది. రాజ‌ధాని పేరుతో రాజ‌కీయం చేద్దామ‌నుకుంటున్న బీజేపీకీ, జ‌న‌సేన‌కూ  ఓ విధంగా డైలామానే ఇది. ఈ రోజు మ‌ధ్యాహ్నం అసెంబ్లీలో జ‌గ‌న్ చెప్పే మాట‌లు ఆధారంగానే రాజ‌కీయ పార్టీలు భ‌విష్య‌త్ కార్యా చ‌ర ణ‌ను ప్ర‌క‌టించేందుకో అమ‌లు చేసేందుకో వీలుంటుంది.


వాస్తవానికి మూడు రాజ‌ధానుల‌పై ఇప్ప‌టికే సీపీఐ ఓ క్లారిటీ ఇచ్చే సింది. క‌ర్నూలు కేంద్రంగా న్యాయ రాజ‌ధాని ఏర్పాటు చేస్తామంటే అందుకు త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని కూడా చెప్పే సింది. పాల‌న సంబంధ వికేంద్రీక‌ర‌ణ‌ను సీపీఎం ఇప్ప‌టిదాకా ఒప్పుకున్నదీ లేదు వ్య‌తిరేకించిందీ లేదు. అలా అని రాజ‌ధాని రై తుకు మ‌ద్ద‌తు ఇచ్చిందీ లేదు. కాంగ్రెస్ మాత్రం అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని కోరుతూ, రాజ‌ధాని రైతుకు మ‌ద్దతుగానే ఉంది.



ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల బిల్లు ను తాము ఉప‌సంహ‌క‌రించుకుంటున్నామ‌ని, దీనిపై అసెంబ్లీలో సీఎం స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌క‌ట‌న చేస్తార‌ని హైకోర్టులో అడ్వకేట్ జ‌న‌ర‌ల్ ఇచ్చిన స్టేట్మెంట్ రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఇది ప్ర‌జా విజ‌యం అని ఎంపీ ర‌ఘురామ అ ని అంటే, అదేం కాద‌ని బిల్లులో న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకులు ఉన్నాయ‌ని, వాటిని సవ‌రించేందుకే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నా మ‌ని పెద్దాయ‌న పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఇది కేవ‌లం విరామం మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. రాజ‌ధాని కి సంబంధించి రైతులు చేస్తున్న ఉద్య‌మం చూసి తాము బెదిరిపోలేద‌ని మ‌రో మారు చెప్పారు పెద్దిరెడ్డి. అంటే రాజ‌ధానిని మార్చేం దుకు వైసీపీ స‌న్నాహాలు చేస్తోంద‌ని బిల్లులో స‌వ‌ర‌ణ‌ల కోస‌మే ఇప్పుడీ మాట చెప్పింద‌ని తేలిపోయింది. బిల్లులో న్యాయ ప‌ర‌మై న అడ్డంకుల‌ను స‌వ‌రించి మ‌ళ్లీ కొత్త బిల్లు తీసుకువ‌చ్చేందుకు జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే ఎగువ స‌భ అయిన శాస‌న మండ‌లిలో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఉండ‌డంతో బ‌లం పెర‌గ‌డంతో తాజా బిల్లు ఉభ‌య స‌భ‌ల ఆమోదం పొందేందుకు ఎటువంటి ఆటంకం ఉండ‌దు. మ‌రో విష‌యం ఏంటంటే ఎలానూ త‌న‌ను అవ‌మానించిన స‌భ‌కు తాను రాన‌ని ముఖ్య‌మంత్రి అయ్యాకే వ‌స్తాన ని విప‌క్ష నేత హోదాలో చంద్ర‌బాబు చెప్ప‌డంతో వైసీపీకి ఇక ఎదురే ఉండ‌దు. క‌నుక ఇదంతా ఇంట‌ర్వెల్ మాత్ర‌మేనని క్లైమాక్స్ మ‌రోలా  ఉంటుంద‌ని పెద్దాయ‌న పెద్ది రెడ్డి చెప్పిన మాట‌ల వెనుక సిస‌లు ఆంత‌ర్యం ఇదే! అందుకే రాజ‌ధాని రైతులు సైతం త‌మ పాదయాత్ర ఆప‌బోమ‌నే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: