మూడు రాజ‌ధానుల ఆట ఇప్పుడే మొద‌ల‌యింది అని అంటోంది వైసీపీ. అదేవిధంగా దీన్నొక జూదంగానే భావిస్తోంది. ఆ విధంగానే చూడాల‌ని అంటోంది కూడా! సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇలాంటి మాట‌లే వినిపిస్తున్నాయి. అయితే జ‌గ‌న్ ఇప్పుడు వెలువ‌రించే నిర్ణ‌యం కూడా ప్రామాణికం ఏమీ కాద‌ని ఇందులో కూడా మార్పులు ఉంటాయ‌ని కూడా అంటోంది. కేవ‌లం న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ప‌రిష్క‌రించుకునేందుకు మూడు రాజ‌ధానుల బిల్లుకు స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని భావిస్తున్నారు జ‌గ‌న్. అయితే ఈ ఆట‌లో బొమ్మ‌లెవ‌రు.. సృష్టి క‌ర్త ఒక బ్ర‌హ్మ త‌ను సృష్టించెనొక జ‌న్మ అన్న పాట మాదిరిగా.. ఈ జ‌న్మ ప్రాణం ఉన్న బొమ్మ‌లా ఎందుకు మారిపోతోంది? ప్ర‌జ‌లెందుకు ఆట బొమ్మ‌ల‌వుతున్నారు...? ఈ ఆట‌లో నిన్న‌టిదాకా గెలిచిన చంద్ర‌బాబు కానీ ఇప్పుడు గెలిచాన‌ని భ్ర‌మిస్తున్న లేదా భావిస్తున్న జ‌గ‌న్ కానీ ప్ర‌జ‌ల‌కు చేసిందేంటి? స‌ర్ నేను ఓడిపోయాను కాదు కాదు స‌ర్ మేం అన‌గా ప్ర‌జ‌లం ఓడిపోయాం మీరు ఆడే ఆట‌ల‌కు అర్థాలు తెలియ‌క తెలుసుకోలేక అంత వ‌క‌బ్ల‌రీ స్టేట‌స్ తెలియ‌క మేం ఓడిపోయాం సర్.. ఓడి పోతూనే ఉన్నాం.


వాస్త‌వానికి ఆరోజు అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌గానే ప్ర‌జ‌ల‌కు అభ్యంత‌రం లేక‌పోతే మాకూ అభ్యంత‌రం లేద‌నే చెప్పారు జ గ‌న్. త‌రువాత పాద‌యాత్ర‌లోనూ అమ‌రావ‌తే రాజ‌ధాని అని దీనిని మార్చే ఉద్దేశ‌మే త‌మ‌కు లేద‌ని కూడా చెప్పారు. పునరుద్ఘా టించారు. కానీ అధికారంలోకి రాగానే ప్రాంతీయ అస‌మాన‌త‌ల నివార‌ణ‌కు అన్ని ప్రాంతాల‌కూ స‌మాన రీతిలో స‌మాన అవ‌కాశాలు అభివృద్ధి అన్న‌వి ద‌క్కేలా తాము మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌తిపాదిస్తున్నామ‌ని చెప్పి ఓ సంచ‌ల‌నం అయ్యారు జ‌గ‌న్. దీనిని ఎవ్వ‌రూ కాద‌న‌రు.

 ఓ విధంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండే ప్రాంతాన్ని చంద్ర‌బాబు అభివృద్ధి చేశార‌న్న అక్క‌సుతోనే ఆయ‌న ఈ పొలిటిక‌ల్ డ్రామాకు తెర‌లేపార‌ని చాలా మంది పైకి చెప్పారు. ఆ రోజు చంద్ర‌బాబు  హ‌యాంలో రెడ్ల‌కు ఎదిగేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. ఆ అక్క‌సుతోనే కమ్మ సామాజిక‌వ‌ర్గం ప్రాబ‌ల్యం పెరిగింద‌న్న అక్కసుతోనే 29 గ్రామాల స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోన‌వ‌సరం లేద‌ని జ‌గ‌న్ ఓ విధంగా పెద్ద త‌తంగ‌మే న‌డిపారు. ఫ‌లితంగా ఈ ఆట‌లో ఓడిపోయిన ప్ర‌జ‌ల‌కు ఇప్పుడేం చేయాలో పాలుపోవ‌డం లేదు. ఆ రోజు జ‌గ‌న్ ఓడారు ఇప్పుడు చంద్ర‌బాబు ఓడారు మొత్తంగా ఆయ‌న‌నో ఈయ‌న‌నో ఎన్నుకున్న పాపానికి ప్ర‌జ‌లు ఓడారు. వాళ్లే రోడ్డున ప‌డ్డారు. లాఠీ దెబ్బలు తిన్నారు. మూడు పంట‌ల నేల‌ను చేజేతులారా  నాశ‌నం చేసుకున్నారు. అవును ఈ పాపం ఆ ఇద్దరిదీ కాదు ఆ ఇద్ద‌రికీ వ‌ర్తిస్తుంది. మూల్యం చెల్లింపు అన్న‌ది కాలం నిర్ణ‌యిస్తుంది. ప‌రిహారం ఎంత‌న్న‌ది కూడా కాల‌మే నిర్ణ‌యిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap