ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మూడు రాజధానులు ఉంటాయని ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు మూడు రాజధానులు బిల్లు తో సీఆర్డీయే ర‌ద్దు చ‌ట్టం బిల్లు కూడా ఉపసంహరించుకున్నట్టు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఏ పరిస్థితుల్లో మూడు రాజధానులు తీసుకు వచ్చామో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారని చెప్పిన ... జగన్ అమరావతి ప్రాంతం అంటే తనకు ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. ఈ ప్రాంతంపై తనకు ఎంతమాత్రం వ్యతిరేకత లేదని తెలిపారు. అలాగే తన ఇల్లు కూడా అమరావతిలోనే ఉందని చెప్పారు.

రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా విశాఖపట్నం ఉందని ... అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పిన జగన్ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ - చెన్నై - బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పోటీపడే పరిస్థితి ఉంటుందని చెప్పారు. రాజధాని ప్రాంతం అటు గుంటూరు , ఇటు  విజయవాడ లో లేదని చెప్పిన జగన్ అమరావతిలో రోడ్లు , డ్రైనేజీ , కరెంట్ సౌకర్యాలు అభివృద్ధి చేయాలంటేనే లక్షల కోట్లు అవుతాయని చెప్పారు.

ఇక మూడు  రాజధాను ల‌ పై సమగ్రమైన బిల్లును తీసుకువస్తామని ... ఇంతకుముందు ఉన్న బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని జగన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జగన్ చేసిన ప్రకటనను బట్టి చూస్తే మూడు రాజధానులు విషయంలో ప్రభుత్వం ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదని అర్థమవుతుంది.

త‌న సీమ ప్రాంతానికి ఎలాగూ స‌చివాల‌యం, అసెంబ్లీ ని మార్చ‌లేని ప‌రిస్థితి. ఆ ప్రాంత ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక త రాకుండా ఉండేందుకు న్యాయ రాజధానిగా కర్నూలు కొనసాగిస్తారని తెలుస్తోంది. మ‌రి ఈ కొత్త మార్పులు , చేర్పుల‌పై సీమ ప్రాంత ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి డిమాండ్లు వ‌స్తాయో ?  కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: