ఇంత‌కాలం చంద్ర‌బాబు ను టార్గెట్ చేసుకుని మాట్లాడిన మాట‌లు చాల్లే కానీ ఇప్పుడు మీరేం చేయాలో తెలుసుకోండి. ఏం చేస్తారో  చెప్పండి. విశాఖ ను ప‌రిపాల‌న సంబంధ రాజ‌ధానిగా మారుస్తారు స‌రే క‌నీసం అక్క‌డ ఇక‌పై చేయ‌ద‌గ్గ ప‌నుల్లో మీరేం చేయగ‌ల‌రో కూడా చెప్పండి. విని సంతోషిస్తాం. రాజ‌ధాని అంశాన్ని తెర‌పైకి తెచ్చి రాష్ట్రంలో న‌లుగుతున్న అనేక విష‌యాల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డ‌మే జ‌గ‌న్ ఘ‌న‌త కానీ ఎత్తుగ‌డ కానీ  అయితే అంత‌కుమించిన త‌ప్పిదం ఇంకొక‌టి ఉండదు. వ‌ర్షం ప్ర‌భావం, వ‌ర‌ద ప్ర‌భావం వీటిపై కూడా మాట్లాడి అసెంబ్లీ బాధితుల‌కు అండ‌గా ఉంటే ఇంకా మేలు. ఇంత‌కాలం అది చేశారు ఇది చేశారు అంటూ వంక‌లు చెప్పిన జ‌గ‌న్ కు చంద్ర‌బాబు చేసిన ప‌నుల గురించి ప‌ట్టించుకునే తీరుబాటు ఎలా ఉందో అదే స‌మ‌యంలో  తాను కొన్ని ప‌నుల‌కు అయినా ప్ర‌తిపాద‌న‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.


జ‌గ‌న్ ఎత్తుగ‌డ ప్ర‌కారం చంద్ర‌బాబు క‌న్నా తానే బెస్ట్ సీఎం కావాల‌ని.. అందుకు అడ్డంగా ఉన్న రాజ‌ధాని అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం అసెంబ్లీలో ఉన్న అవ‌రోధాలు దాటి రావ‌డం చాలా ఇష్టం. అదే ఆయ‌న ప్ర‌థ‌మ ప్రాధాన్యం కూడా! అయితే ఇంత‌వ‌ర‌కూ చంద్ర‌బాబును ఆడిపోసుకున్న నోళ్లు ఇప్పుడ‌యినా మూత‌ప‌డి తామేం చేయాల‌నుకుంటున్నారో క‌నీసం ఓ స్థాయి నాయ‌కుల‌కు అయినా వివ‌రించి ప్ర‌జ‌ల్లోకి వాటిని తీసుకు వెళ్లాల్సిన అవ‌సరం జ‌గ‌న్ కు ఉంది. ఇదే జ‌గ‌న్ ఎత్తుగ‌డ అయితే ఇంకా సంతోషం.రాజ‌ధాని క‌థ ఓ విధంగా మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి ఇంత‌కాలం కోర్టులలో న‌లిగి, రోడ్ల‌పై నినాదాలుగా వెలిగి మ‌ళ్లీ ఈ క‌థ మొద‌టికే వ‌చ్చింది. అందుకే చంద్ర‌బాబు గురించి ఆయ‌న చేప‌ట్టిన రాజ‌ధాని గురించి మాట్లాడుకోవ‌డం తిట్టుకోవ‌డం ఆపి ఇక‌పై అయినా ఏదో ఒక‌టి చేయాలి. ఆ విధంగా ప‌నులు చేప‌ట్టాలి. జ‌గ‌న్ ఎత్తుగ‌డ ఏంటంటే చంద్ర‌బాబు గురించి ఇక మాట్లాడుకునేలా లేదా ఆయ‌న ఏడుపులు గురించి ఇక ఏమీ వినిపించ‌నీయ‌కుండా కొత్త‌గా ఈ అంశం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టి త‌న వాద‌న ఏంట‌న్న‌ది వినిపించారు.అయితే ఇంత‌కాలం చంద్రబాబు అది చేయ‌లేదు ఇది చేయ‌లేదు అని అనేకన్నా ఇప్పటికిప్పుడు  ప్ర‌జ‌ల కోసం జ‌గ‌న్ ఏం చేస్తారు అన్న‌దే ముఖ్యం. అదే వాద‌న‌ను ఆయ‌న కూడా వినిపించాలి. వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి అంతా కీల‌కంగా మారిపోయింది. కానీ అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు అయితే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర లేవు. ఇంత‌కాలం చంద్ర‌బాబును తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన వైసీపీ ఇక‌పై కూడా అదే ప‌ని కొన‌సాగించ‌కుండా అభివృద్ధి చేయాలి. జ‌నం త‌న‌కోసమే అనుకునేలా చంద్ర‌బాబును మ‌రిచిపోయేలా జ‌గ‌న్ ప‌నిచేయాలి. ఇలాంటి ఎత్తుగ‌డ ఏదో జ‌గ‌న్ అనుకోవాలి. అంటే చంద్ర‌బాబు ఏడుపులు క‌న్నా అభివృద్ధి విష‌య‌మై తాను వినిపించే న‌వ్వులే కీల‌కం కావాలి జ‌గ‌న్ కు. అదే ఎత్తుగ‌డ అయితే బాగుంటుంది. కానీ ఆ విధంగా ప‌రిణామాలు ముందున్న కాలంలో ఉంటాయా లేదా అన్న‌ది ఓ డౌట్.

మరింత సమాచారం తెలుసుకోండి: