ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలపై తన దృష్టిని పెట్టడం జరిగింది. చెప్పిన విధంగానే జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. గత ఎన్నికలలో పనితీరు సరిగా లేని కారణంగా టీడీపీ పై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకు ప్రజల్లో కొత్త ఆలోచనలు వస్తున్నట్లు తెలుస్తోంది. హామీల పేరుతో రాష్ట్రాన్ని ఆర్ధికంగా కుదేలయ్యేలా చేస్తున్నారని చర్చించుకోవడం మొదలు పెట్టారు.

సంక్షేమ పథకాల అమలులో పొరపాట్లు లేకున్నా రాష్ట్రంలో ప్రశాంతత కరువయిందనే విమర్శలు ఎక్కువవుతుండడంతో ప్రతిపక్ష టీడీపీ సరైన సమయంలో ప్రజల గొంతుకను తమదిగా చేసుకుని వైసీపీపై పోరాటం ప్రారంభించారు. ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికలలో వైసీపీపై వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్పడానికి కొన్ని చోట్ల టీడీపీ గెలవడం మరియు మరి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇవ్వడంతో క్లియర్ గా అర్ధమైంది. అంతే కాకుండా వైసీపీది రౌడీ రాజ్యం అంటూ కొన్ని ఏరియాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది.

అయితే టీడీపీ ఈ వ్యతిరేకతను వాడుకుని రాబోయే ఎన్నికలకు ఉపయోగించుకుంటుందా అన్నది పూర్తిగా వారి చేతిలోనే ఉంది. ఇలా ప్రజల అంచనాలకు విరుద్ధంగా వైసీపీ పాలన ఉండడంతో ప్రజలు పూర్తిగా డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 2019 లో సగానికి పైగా ఓటర్లు టీడీపీని వద్దనుకుని వైసీపీకి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు వైసీపీ పాలనలో అంత సంతృప్తిగా లేరనేది చాలా మంది మనస్సులో ఉందని ఈ మధ్య మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ప్రజలు ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా బయటపడరు. అవసరమైన సమయంలో ఓటు రూపంలో సరైన సమాధానం చెబుతారు. ఇది చాలా సార్లు జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: