'ఈ సారికి అడ్జస్ట్ అయిపో... నిన్నేమీ కాంపర్ మైజ్ అవమనటం లేదు. ఈ పని మానేసి ఇంకో పని చేయడం కాంపర్ మైజ్. ఇ దే పనిని ఇంకోలా చేయడం అడ్జస్ట్ మెంట్. ఈ సారికి అడ్జస్ట్ అయిపో.'.. ఓ సినిమాలో  రచయిత, నటుడు తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్. నేటి శాసన సభ సమావేశాల్లో  రాజధాని పై జరిగిన చర్చ . సభా నాయకుడు, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆయన ఆలోచనా ధోరణి ని  స్పష్టం చేసింది.
2011 మార్చి 12న పార్టీ స్థాపించింది మొదలు 2019 వరకూ ఆయన అధికారం కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశా రన్నది సుస్పష్టం.  2014  నుంచి 2019 వరకూ ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2019లో  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151  సీట్లలో విజయం సాధించి మఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. వెంట వెంటనే పాలన లో తనదైన మార్కు చూపాలని ఉబలాట పడ్డారు.  కారణాలు ఏవైనా ఆయనకు పరిపాలనలో చాలా ఎదురు దెబ్బలుతగిలాయి. వాటిలో మూడు రాజధానుల అంశం ఒకటి. కోర్టులో ఈ అంశంపై  రోజు వారి వాదనలు ఆరంభమయ్యాయి. నిత్యం  ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి  పరిస్థితి ఏర్పడింది. ఇది అధికార పక్షానికి కొంత ఇబ్బందిని కలిగించిన విషయం. పైకి చెప్పలేక, లోపలఏం చేయాలో తోచక అధికార పక్షం మూడు రాజధానుల బిల్లును కొద్ది కాలం వెనక్కి తీసుకుంది. సమగ్రమైన రీతిలో ఈ బిల్లు తిరిగి ప్రవేశ పెడతామని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో విశాఖ పట్నం పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతకు ముందు సభలో మాట్లాడిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి  పరిపాలన వికేంద్రీకణ దిశగా సోదాహరణ ప్రసంగం చేశారు.  పనిలో పనిగా తెలుగు దేశం ప్రభుత్వం శివరాకృష్ట కమిటీ నివేదినకు పక్కన పెట్టిందని ఆరోపించారు.తెలుగు మాట్లాడే వారికి ఒక ప్రాంతం కావాలి కానీ, వారి వారి ప్రాంతాలలోని వారికి ఆశలూ, ఆకాంక్షలకు తగ్గట్టుగా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. రాయలసీమ వాసులు,  ఉత్తరాంద్ర వాసులు,  కోస్తా జిల్లాల ప్రజలకు వారి వారి ప్రాంత సమస్యలు తీర్చాలనే డిమాండ్ ఉన్నదని ఆర్థిక మంత్రి సభకు వివరించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోఉండే జిల్లాలు  ఏఏ ప్రాంతాల నుంచి వచ్చి ఏపి లో ఏ విధంగా కలిశాయో  బుగ్గన వివరించారు.  గతంలో మూడు రాజధానుల బిల్లు శాసన సభలో ప్రవేశ పెట్టే సమయంలో ఆయన చేసిన ప్రసంగాన్ని కొద్ది మార్పులు చేసి మరలా అవే పలుకులను సభలో మాట్లాడారు ఆర్థిక మంత్రి బుగ్గన. గతంలో హైదరాబాద్ రాజధాని కేంద్రంగా అభివృద్ది అంతా అక్కడే కేంద్రీకృతమైందని  సోదాహరణంగా పేర్కోన్నారు.  గతంలో పాలకులు నిర్ణయాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందని  చెప్పకనే చెప్పారు ఆర్థిక మంత్రి. ఆ తప్పులను తాము మరలా చేయదల్చుకోలేదని  బుగ్గర రాజేంద్ర నాథ్ రెడ్డి సభా ముఖంగా స్పష్టం చేశారు.
 పరనింద, స్తోత్కర్ష  అన్న చందాన ముఖ్యమంత్రి ప్రసంగం సాగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కోంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: