ఏపీలో రాజధాని రగడ మళ్లీ మొదలైంది. అసలు అది ఆరింది ఎపుడూ అన్న చర్చ కూడా ఉందనుకోండి. అయితే ఇపుడు సరికొత్త రచ్చకు జగన్ తెర తీశారు. అమరావతి చుట్టూ రాజకీయ ఆరాటం పోరాటం సాగుతున్న వేళ జగన్ వేగంగా పావులు కదిపారు.

ఏపీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ కి ఆది గురువు జగనే. అసలు దేశానికి కూడా ఇది కొత్త. అందుకే అంతా దీని మీద ఆసక్తిని చూపించారు. అంతే కాదు, దీని మీద జరిగిన చర్చ ఇంతా అంతా కాదు. రెండేళ్ల క్రితం అసెంబ్లీలో జగన్ మూడు రాజధానుల మీద ఇచ్చిన భారీ  స్టేట్మెంట్ తో మొత్తం సీన్ మారిపోయింది. అమరావతి రైతులు నాటి నుంచి ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడా తగ్గలేదు.

దాంతో వారంతా లేటెస్ట్ గా మహా పాదయాత్రను మొదలెట్టారు. మరో వైపు సాగునీటి చట్టాల రద్దుతో మోడీ కూడా తలొగ్గిన వేళ జగన్ సడెన్ గా మూడు రాజధానుల మీద షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. కోర్టులో ఉన్న ఈ కేసు విచారణ జోరుగా సాగుతున్న వేళ చట్టమే రద్దు అనేశారు. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుంది, నిజంగా జగన్ కూడా మోడీ బాటలోనే అని భావించారు. అయితే ఎవరి ఆనందం ఆశలు అంచనాలకూ అందకుండా జగన్ మళ్లీ కొత్త బిల్లుతో అసెంబ్లీకి రాబోతున్నారు.

అటు శాసనమండలిలో పూర్తి మెజారిటీ ఉన్న వేళ జగన్ కొన్ని టెక్నికల్ అంశాలను కూడా సర్దుబాటు చేసుకుని ఎవరూ వేలెత్తి చూపించకుండా పకడ్బందీగా బిల్లు రెడీ చేస్తున్నారు. ఈ బిల్లుతో ఇక ఏ రకమైన వివాదాలు కూడా రావు అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ లో ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ ఈ కొత్త బిల్లుని ఆమోదించడానికి జగన్ చూస్తున్నారు అంటున్నారు. అదే నిజమైతే అమరావతి పోరాటం తో పాటు దానికి మద్దతు ఇస్తున్న వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: