ఏపీ రాజకీయాల్లో అపర చాణక్యుడు అన్న బిరుదు ఇప్పటిదాకా చంద్రబాబుకే ఉంది. ఆయన ఎత్తులనే జనాలు చూశారు. ఆయనను మించిన వారు ఉండరనే అనుకున్నారు. ఇక టీడీపీ వారికైతే బాబుని మించే వారు ఉండరన్నది కచ్చితమైన నమ్మకం.

కానీ ఏపీలో జగన్ ఎంట్రీతో మాత్రం పొలిటికల్ గా  కంప్లీట్ గా సీన్ మారింది. రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తిన్న బాబుని సైతం పొలిటికల్ గా ఎన్ని ఇబ్బందులలోకి నెట్టిన చాతుర్యం జగన్ ది అంటే అంగీకరించేవారే ఎక్కువగా ఉంటారు. అసలు జగన్ కి ఏమి తెలుసు అన్న వారే ఇపుడు ఆశ్చర్యంగా చూసే విధంగా ఆయన మార్క్ పాలిటిక్స్ ఉంటోంది.

జగన్ ఏపీ రాజకీయాలలో తనదైన ముద్రను  వేసుకుంటున్నారు. చంద్రబాబు ఎత్తులకు ఆయన పై ఎత్తులు వేస్తూ ముందుకు పోతున్నారు. ఇపుడు అమరావతి రాజధాని రైతుల ఉద్యమం విషయంలో కూడా అదే చేశారు. మహా పాదయాత్ర అంటూ రైతులు ఆందోళనలు చేస్తుంటే టీడీపీ సహా ఇతర పక్షాలు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నాయి. దాంతో ఏకంగా మూడు రాజధానులే రద్దు అంటూ జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అంతేనా కోర్టులో వ్యాజ్యాలు అన్నీ కూడా దాని మీద పడ్డాయి. దీంతో వాటిని అధిగమించేందుకు మళ్లీ కొత్త బిల్లు అంటున్నారు.

ఈసారి చూస్తే వైసీపీకి అసెంబ్లీ, మండలిలో పూర్తి మెజారిటీ ఉంది. ఎవరూ కాదనలేని స్థితి. దాంతో ఎవరూ ఏమనలేని సీన్ ఉంటుంది అంటున్నారు. ఇంకో వైపు ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని మరో మారు వేడెక్కించడం ద్వారా 2024 ఎన్నికలకు తన అజెండా ఏంటో జగన్ చెప్పేశారు. అమరావతి పేరు మీద టీడీపీ కానీ ఇతర పక్షాలు కానీ ఎన్నికలను ఫేస్ చేయాల్సిన అనివార్యతను కల్పిసున్నారు. మొత్తానికి బాబును మించిన వ్యూహంతోనే జగన్ ముందుకు పోతున్నారు అంటున్నారు. చూడాలి మరి జగన్ ఎత్తులకు బాబు ఎలాంటి పై ఎత్తులు వేస్తాడో.




మరింత సమాచారం తెలుసుకోండి: