కృష్ణా జిల్లా రాజకీయాల్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే వంశీ మంచి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి...ఆ పార్టీ తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు వైసీపీ వైపుకు వచ్చి..ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వెళ్ళడంతో వంశీకు చెక్ పెట్టాలని టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి.

కానీ వంశీకి చెక్ పెట్టడం అంత సులువు కాదనే చెప్పాలి. ఎందుకంటే వంశీకి పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఉంది. గన్నవరం నియోజకవర్గంలో ఆయనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. బలమైన అనుచరగణం ఉంది. అదే వంశీని విజయతీరాలకు చేర్చడం ఖాయమని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో గన్నవరం బరిలో వంశీ...వైసీపీ తరుపున బరిలో దిగడం ఫిక్స్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ ఉన్న వైసీపీ నేతలు ఇప్పటికే సైడ్ అయ్యారు.

దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఎమ్మెల్యే రేసులో తప్పుకున్నట్లే కనిపిస్తోంది. వంశీకి ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టే ఆయనకే సీటు ఇవ్వడం ఖాయం. అలాగే గన్నవరంలో వంశీ విజయాన్ని ఆపడం కూడా చాలా కష్టమని తెలుస్తోంది. కానీ వంశీని ఆపాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆయన దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.

అలాగే అధికార పార్టీ వైపు ఉండటంతో నియోజకవర్గంలో పనులు కూడా బాగానే చేయించుకుంటున్నారు. గన్నవరంలో ప్రజల మద్ధతు కూడా వంశీకే ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో వంశీని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. మామూలుగా అయితే గన్నవరం టీడీపీ కంచుకోటే. కానీ వంశీ టీడీపీలో ఉండగా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. ఇప్పుడు వారు వంశీతో పాటు వైసీపీలోకి వచ్చేశారు. దీంతో గన్నవరంలో టీడీపీ బాగా వీక్ అయింది. అక్కడ టీడీపీ ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు కూడా వీక్‌గానే ఉన్నారు. కాబట్టి గన్నవరంలో వంశీతో అంత ఈజీ కాదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: