విశాఖ సిటీ...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. సిటీలో టీడీపీకి గట్టి పట్టు ఉంది. నగర ప్రజలు టీడీపీకి మద్ధతు ఎక్కువ ఇస్తుంటారు. అందుకే గత ఎన్నికల్లో అంతటి జగన్ గాలిలో సైతం సిటీలో ఉన్న నాలుగు స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాసరావు, సౌత్‌లో వాసుపల్లి గణేశ్, ఈస్ట్‌లో వెలగపూడి రామకృష్ణ, వెస్ట్‌లో గణబాబులు టీడీపీ తరుపున గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కాస్త పరిస్తితి మారింది.

సిటీలో పాగా వేయడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతూ ముందుకెళ్లింది. ఎలాగైనా నగరంలో సత్తా చాటాలనే విధంగా విజయసాయిరెడ్డి వ్యూహాలు రచిస్తూ, టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే విజయసాయి వ్యూహాలు కావొచ్చు...వైసీపీ అధికారంలో ఉండటం కావొచ్చు...టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడటం కావొచ్చు....విశాఖ సిటీలో టీడీపీ బలం తగ్గి వైసీపీ బలం పెరిగింది.

నెక్స్ట్ ఎన్నికల్లో నగరంలో రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో పరిస్తితిని అంచనా వేస్తుంటే...వైసీపీకి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల నాటికి వైసీపీ ఇంకా పికప్ అయితే నాలుగు సీట్లని గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఒక్కో నియోజకవర్గంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయనే విషయం ఒక్కసారి గమనిస్తే...విశాఖ సౌత్‌లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. పైగా సౌత్‌లో టీడీపీకి బలమైన నాయకుడు లేరు.

ఇటు నార్త్ విషయానికొస్తే...గంటా శ్రీనివాసరావు అడ్రెస్ లేరు. ఆయన నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు. పైగా అటు వైసీపీలో కేకే రాజు పుంజుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో నార్త్‌లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది. వెస్ట్ విషయానికొస్తే టీడీపీ ఎమ్మెల్యే గణబాబు..తన పని తాను చేసుకుంటున్నారు. టీడీపీతో సంబంధం లేనట్లు ఉంటున్నారు. ఇక్కడ టీడీపీకి అనుకూలంగా పరిస్తితులు లేవు. ఈస్ట్‌లో వరుసగా మూడుసార్లు గెలుస్తూ వస్తున్న వెలగపూడిపై కూడా వ్యతిరేకత పెరుగుతుంది. కానీ ఈస్ట్ టీడీపీకి కంచుకోట కాబట్టి కాస్త ఇక్కడ బెటర్ గా ఉందని చెప్పొచ్చు. ఏదేమైనా విశాఖ సిటీలో ఈ సారి వైసీపీ సత్తా చాటేలా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: