ఏదేమైనా రాష్ట్ర విభజన అంశం వల్ల కాంగ్రెస్ దెబ్బతినడం....దాని వల్ల కొందరు కాంగ్రెస్ నేతలు సైతం రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్తితి వచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో చక్రాలు తిప్పిన నేతలు...ఇప్పుడు కంటికి కనబడటం లేడు. చాలామంది నేతలు వైసీపీ, టీడీపీల్లోకి వెళ్ళి రాజకీయంగా నిలబడ్డారు. కానీ కొందరు రాజకీయంగా వేసిన కొన్ని తప్పటడుగులు వల్ల పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించని పరిస్తితి ఉంది.

అలా ఒకప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాలని శాసించిన సీకే బాబు...రాజకీయంగా అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. అసలు సీకే బాబు అంటే చిత్తూరులో బలమైన నేత....బలమైన అనుచరగణం ఉన్న నాయకుడు. రాజకీయంగా ఈయన్ని ఢీకొట్టడం ప్రత్యర్ధులకు సాధ్యం కాని పని, చంద్రబాబు సైతం రాజకీయంగా సీకే బాబుకు చెక్ పెట్టలేకపోయారు. అందుకే చిత్తూరు అసెంబ్లీలో సీకే బాబు...నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

1989లో ఇండిపెండెంట్‌గా గెలిచిన సీకే బాబు..1994, 1999 ఎన్నికల్లో పూర్తిగా టీడీపీ గాలిలో సైతం చిత్తూరు అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. 2004లో ఓటమి పాలైన సీకే..2009 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి సత్తా చాటారు. ఇంతవరకు సీకేకు తిరుగులేని పరిస్తితి. కానీ 2014 ఎన్నికల నుంచి సీన్ మారింది...కాంగ్రెస్‌ పరిస్తితి దారుణంగా అవ్వడంతో సీకే..వైసీపీకి మద్ధతుగా వచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీలో వైసీపీ అభ్యర్ధికి మద్ధతు ఇచ్చారు. కానీ అప్పుడు వైసీపీ ఓడిపోయింది.

ఆ తర్వాత సీకే వైసీపీకి దూరమయ్యారు. 2017లో బీజేపీలో చేరి మళ్ళీ ఆ పార్టీకి దూరం జరిగారు. 2019 ఎన్నికల్లో టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆ పని చేయలేదు. అలా అని ఇండిపెండెంట్‌గా పోటీకి దిగలేదు. అయితే చిత్తూరులో సీకే బలం ఏమి తగ్గలేదు. ఆయనకు నియోజకవర్గంలో ఫాలోయింగ్ ఉంది. ఇక ఈయన్ని టీడీపీలో లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎలాగో వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు...కానీ టీడీపీకి నేత లేరు. మాజీ ఎమ్మెల్యే మనోహర్ పార్టీని వీడారు. ఈ క్రమంలో సీకేని టీడీపీలోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి సీకే బాబు రాజకీయంగా ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: