అధికార పార్టీలో ఉన్నా సరే కొందరు సీనియర్ నేతలు...హైలైట్ అవ్వలేని పరిస్తితి. సైలెంట్‌గానే రాజకీయం చేసే పరిస్తితి. అసంతృప్తి ఉన్నా సరే పైకి పెద్దగా హడావిడి చేయకుండా...ఏదో ఛోటా నాయకుడు మాదిరిగా రాజకీయం చేసే పరిస్తితి....అధికార వైసీపీలో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలది. అలాంటి పరిస్తితే ఆనం రామనారాయణరెడ్డిది. నెల్లూరు జిల్లాలో ఆనం పొజిషన్ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్‌లో ఉండగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈయనే చక్రం తిప్పారు.

ఆనం ఫ్యామిలీ అంటే తిరుగులేదు ఇంకా. ఒక వైపు రామనారాయణరెడ్డి, మరొకవైపు ఆనం వివేకానందరెడ్డి..వీరు నెల్లూరు జిల్లా రాజకీయాలని శాసించే వారు. రామనారాయణ మంత్రిగా కూడా జిల్లాలో కీలకంగా పనిచేశారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్నంతవరకు ఆనం ఫ్యామిలీకి తిరుగులేదు. కానీ ఆ తర్వాత నుంచి పరిస్తితి మారింది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగి...కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారైందో అప్పటినుంచి ఆనం ఫ్యామిలీ హవా తగ్గింది.

2014 తర్వాత వీరు టీడీపీలోకి వెళ్లారు. ఇక మధ్యలో వివేకా మరణించారు. ఆ తర్వాత రామనారాయణ వైసీపీలోకి వెళ్ళి...2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సీనియర్ కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించారు గానీ, పదవి రాలేదు. పైగా జిల్లాలో ఈయన కంటే జూనియర్లకు మంత్రి పదవులు వచ్చాయి. దీంతో ఆయన ప్రాధాన్యత తగ్గింది.

పైగా తనకు అధికారులు కూడా సహకరించని పరిస్తితి...పలు సందర్భాల్లో ఆనం...అధికారులపై కూడా ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని బహిరంగంగానే విమర్శలు చేశారు. అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ని డైరక్ట్‌గానే విమర్శించారు.  ఇలా సొంత పార్టీపై విమర్శలు చేయడంతో ఆనంకు మరింత ఇబ్బంది అయింది. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇంకా తగ్గుతూ వచ్చింది. నెక్స్ట్ కోటాలో కూడా ఆయనకు పదవి దక్కే అవకాశాలు లేవు. పోనీ వచ్చే ఎన్నికల్లో గెలిచిన పదవి దక్కుతుందనేది డౌటే. మరి ఈ పరిస్తితులని బట్టి చూస్తే ఆనం రాజకీయంగా ఏమన్నా రూట్ మారుస్తారా? లేక పదవి సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: