2019 ఎన్నికల నుంచి వైసీపీ హవాలో చాలా తెలుగుదేశం పార్టీ కంచుకోటలు కూలిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కంచుకోటల్లో వైసీపీ పాగా వేసే పరిస్తితి వచ్చేసింది. స్థానిక ఎన్నికల్లో ఎక్కడకక్కడ టీడీపీ కంచుకోటలు బద్దలైన విషయం తెలిసిందే. ఆఖరికి చంద్రబాబు కంచుకోట కుప్పం కోట కూడా బద్దలైంది. కుప్పంలో టీడీపీ చిత్తు అయిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో కూడా టీడీపీ ఘోర ఓటమిని ఎదురుకుంది.

టీడీపీకి కుప్పం, హిందూపురం ఎలాగో...ఉండి కూడా అలాగే...ఎందుకంటే మొదట నుంచి ఉండి ప్రజలు టీడీపీని గెలిపిస్తూనే వస్తున్నారు. మధ్యలో 2004 ఎన్నికల్లోనే ఒక్కసారి అక్కడ పార్టీ ఓడింది అంతే...ఇంకా పార్టీ పెట్టిన 1983 నుంచి 2019 వరకు ఉండిలో టీడీపీ జెండా ఎగురుతూనే వస్తుంది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఉండిలో వైసీపీ పాగా వేసే దిశగా ముందుకెళుతుంది.

స్థానిక ఎన్నికల్లో ఎలాగో వైసీపీ జెండా ఎగిరింది. ఇటీవల ఆకివీడు మున్సిపాలిటీలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. ఆకివీడులో టీడీపీనే గెలుస్తుందని అంతా అనుకున్నారు...పైగా జనసేన మద్ధతు తీసుకుంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ వైసీపీ హవా ముందు తేలిపోయాయి. 20 వార్డులు ఉంటే వైసీపీ 12, టీడీపీ 4, జనసేన 3, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. అనూహ్యంగా మెజారిటీ వార్డులు గెలుచుకుని ఆకివీడుని వైసీపీ సొంతం చేసుకుంది. అయితే ఉండి నియోజకవర్గంలో టీడీపీ పట్టు తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్యే మంతెన రామరాజుపై వ్యతిరేకత పెరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనే మళ్ళీ ఉండి బరిలో నిలబడితే కష్టం.

అయితే 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన వేటుకూరి శివరామరాజు మళ్ళీ ఉండి బరిలో నిలబడితే టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆయనకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక టీడీపీ కంచుకోట అయిన ఉండిని ఆయనే కాపాడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: