రాజకీయాల్లో నాయకుల జంపింగ్‌లు అనేవి సహజమే..రాజకీయంగా అవసరాలని బట్టి, అవకాశాలని బట్టి నేతలు పార్టీ మారిపోతారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే నాయకులు అధికార పార్టీల్లోకి వెళ్లిపోతారు. అయితే అధికార పార్టీల్లో ఏదొక పదవి వస్తుందని నేతలు ఆశపడతారు. కానీ అధికార పార్టీలో కూడా హ్యాండ్ ఇచ్చే పరిస్తితి ఉంటే ఆ నాయకుల బాధ వర్ణాతీతం అని చెప్పొచ్చు. పైగా భవిష్యత్‌పై గ్యారెంటీ లేకపోతే అంతకంటే బాధ ఉండదు.

ఇప్పుడు అధికార వైసీపీలో ఇద్దరు మాజీ టీడీపీ నేతలది అదే పరిస్తితి. పదవులు ఏమి రాలేదు....భవిష్యత్‌లో ఏదైనా వస్తుందనే గ్యారెంటీ లేదు. అలా వైసీపీలో ఉన్న భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్న నాయకులు వచ్చి..మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు. శిద్ధా రాఘవరావు...2014 ఎన్నికల్లో దర్శి నుంచి గెలిచి...చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ తరుపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక తన తనయుడు సుధీర్‌తో కలిసి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చాక ఏ పదవి రాలేదు. పైగా భవిష్యత్‌లో ఏదొక సీటు వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే వైసీపీలో అందరూ సిట్టింగ్‌లే. ఇంతవరకు శిద్ధాకు క్లారిటీ లేదు. అటు బాలయ్య ఫ్రెండ్ అయిన కదిరి బాబూరావు...2014లో టీడీపీ తరుపున కనిగిరిలో పోటీ చేసి గెలిచారు. కనిగిరిలో బాగా వ్యతిరేకత రావడంతో చంద్రబాబు, బాబూరావుని 2019 ఎన్నికల్లో దర్శి బరిలో నిలబెట్టారు. ఇక్కడ కూడా బాబూరావు ఓటమి పాలయ్యారు.

అంటే శిద్ధాని ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలబెట్టడంతో దర్శి సీటు ఖాళీగా ఉండటంతో బాబూరావుని ఇటు తీసుకొచ్చేశారు. అటు కనిగిరి సీటు ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ఇచ్చారు. అయితే జగన్ గాలిలో అందరూ ఓడిపోయారు. ఓడిపోయాక బాబూరావు సైతం టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చాక అసలు అడ్రెస్ లేరు. నెక్స్ట్ ఏదైనా సీటు వస్తుందనే గ్యారెంటీ లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: