2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొద్ది కాలం పాటు సైలెంట్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు... ఇప్పుడు క్రమంగా తమ వాయిస్ రైజ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక  నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నేతలు ఇప్పటికే ఓ కార్యాచరణ రెడీ చేశారు. అధికారం కోల్పోయిన తొలి నాళ్లలో కేసులకు భయపడి బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బంది పడిన టీడీపీ నేతలు... ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు... ప్రజా పోరాటానికి రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత... ముందుగా కొంతమంది ముఖ్య నేతలపై అధికార పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా మహేశ్వర రావు వంటి నేతలపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. అరెస్ట్ చేశారు. జైలులో పెట్టారు. దీంతో మిగిలిన నేతలు కాస్త వెనుకడుగు వేశారు. ఇంకా చెప్పాలంటే... దాదాపు ఏడాది కాలం పాటు బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోయారు తెలుగు తమ్ముళ్లు.

అయితే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లలో ధైర్యం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి రెండున్నర ఏళ్ల కాలం పూర్తయింది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అధికార పార్టీ హవా కొనసాగింది. ఇంకా చెప్పాలంటే... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కనీస స్థానాలను కూడా తన ఖాతాల్లో వేసుకోలేకపోయింది. పైగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంకా సైలెంట్‌గా ఉంటే... పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని తెలుగు తమ్ముళ్లు గుర్తించినట్లు ఉన్నారు. దీంతో ఇకపై ప్రభుత్వంపైన, అధికార పార్టీ నేతలపైన పోరాటం చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఓ వైపు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజాక్షేత్రంలో తేల్చుకున్న తర్వాతే మళ్లీ అసెంబ్లీలో కాలు పెడతా అంటు ఇప్పటికే శపధం చేశారు. దీంతో అధినేత బాటలోనే తెలుగు తమ్ముళ్లు కూడా ప్రజా పోరాటానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: