నవంబర్ 11వ తేదీన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. దీనితో ప్రారంభమైన కార్యక్రమాలు ఫిబ్రవరి వరకు నాలుగు మాసాలుగా నిరంతరంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు కొనసాగించాలని ఆలోచించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి సదస్సులు, ప్రదర్శనలు, పాదయాత్రలు, సంతకాల సేకరణ ఉంటాయి. 2022 బడ్జెట్ సమావేశాలు జరగనున్న ఫిబ్రవరి మాసంలో దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలు కలిసి మరోమారు సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడాన్ని దేశ ప్రజలు అందరు గమనించి తమ కర్తవ్యాన్ని, భాగస్వామ్యాన్ని నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

   2020 నవంబర్ 26వ తేదీన జరిగిన సార్వత్రిక సమ్మె 25 కోట్ల కార్మికులు ఉద్యోగులు పాల్గొన్న భారత్లో జరిగిన అతిపెద్ద సమ్మె అని అమెరికా దేశపు సోషలిస్టు పత్రిక" జాకోబ్" విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడాన్ని దేశ ప్రజలందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది.
 ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వ ఆర్థిక విధానం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ విధానం కేవలం కార్మికులకు కర్షకులకు మాత్రమే కాదు దేశ ప్రజల యొక్క అభివృద్ధికి ఆటంకమని ప్రజలు గ్రహిస్తే నే ఉద్యమం మరింత బలోపేతం అవుతుంది.

 
 కార్మిక కర్షక సంఘాల ప్రధాన ఆరోపణలు:-

  మనమందరము కళ్ళారా చూస్తూ అనుభవిస్తున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తో పాటు నిత్యావసర సరుకుల ధరలు అదుపు లేకుండా పెరిగిపోతూ సామాన్య మధ్యతరగతి వర్గాలను అనేక ఇబ్బందులకు గురిచేయడంపట్ల కార్మిక సంఘాల ఐక్యవేదిక కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన ట్లు తెలుస్తోంది. "నేషనల్ మానిటరింగ్ పైప్లైన్" అనే పేరుతో ప్రజా సంపదను జాతి ఆస్తులను విక్రయించడం పట్ల రైల్వేలు, రక్షణ రంగం, వైమానిక, ఓడరేవులను కూడా ప్రైవేటు పరం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని దేశ ప్రజలందరూ ప్రతి ఘటిస్తే తప్ప కేంద్రం దిగి రాదని మరొక్కమారు సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపు ఇవ్వడాన్ని సామాన్య ప్రజలు గా మన బాధ్యతను కూడా గుర్తించి ఉద్యమానికి సహకరిస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుంది.
    వివిధ రూపాలలో, అనేక దశలలో ప్రజలు, కార్మికులు ,రైతులు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేఖించినప్పటికి పట్టించుకోని ప్రభుత్వ విధానాన్ని తిప్పికొట్టడానికి ప్రజలను చైతన్యం చేయడమే పరిష్కారమని భావించిన కార్మిక సంఘాల ఐక్యవేదిక కృషిని పోరాట షెడ్యూల్ను దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు.


 తమ తమ స్థాయిలో పాల్గొనవలసినదిగా పిలుపునిచ్చిన కార్మిక సంఘాలకు  జాతి యావత్తు మద్ద తీయవలసిన అనివార్య పరిస్థితి నేడు దేశంలో నెలకొన్నది. ఈ పోరాటానికి రూపొందించిన కార్మిక సంఘాల లో ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి, హెచ్ ఎం ఎస్, సి ఐ టి యు, ఏ ఐ  యు టి యు సి, టి యు సి సి, ఎస్ ఈ డబ్ల్యూ, ఏ ఐ సి సి టి యు, ఎల్ పి ఎఫ్,  యూటీ యు సి తదితర సంఘాల ఆమోదంతో నాలుగు మాసాల పోరాట షెడ్యూలు విడుదల అయినట్లుగా మనం గుర్తించాలి. పోరాటానికి కార్మిక కర్షక సంఘాలు నాయకత్వం, బాధ్యత తీసుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, కర్షకులు, ఆదివాసీలు, ఉద్యోగులు అందరూ కూడా మరొక్కమారు రెండు రోజులు జరిగే "సార్వత్రిక సమ్మె" లో అత్యధిక సంఖ్యలో పాల్గొని కేంద్రం కళ్ళు తెరిపించవలసిన అవసరం ఉన్నది. మన పోరాటం తో ప్రభుత్వం తప్పక దిగి వస్తుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: