మొన్న జరిగిన అసెంబ్లీ ఘటన మరువకముందే... నిన్న అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి సంచలన ప్రకటన చేశారు.   గతంలో తాము తీసుకువచ్చిన... మూడు రాజధానులు బిల్లును.. ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ బిల్లును తీసుకువచ్చామని.. కానీ కొంతమంది... దాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారని అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే వార్ ఎవరికో భయపడి తాము వెనక్కి... తగ్గటం లేదని.. కానీ బిల్లులో సవరణలు చేసి మరోసారి అసెంబ్లీ ముందుకు వస్తానని ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. తనకు అమరావతి రాజధాని అంటే చాలా ఇష్టమని.. అలాగే తన ఇల్లు అమరావతి సమీపంలోనే ఉందని పేర్కొన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.  

కాబట్టి తనకు రైతులంటే అమరావతి అంటే ఇష్టం లేనట్టు కాదని ఆయన చెప్పే ప్రయత్నం మనం అసెంబ్లీలో చూడవచ్చు. అయితే ఈ మూడు రాజధానులు విషయంలో తాము త్వరలోనే మరో కొత్త బిల్లుతో.. అంటే మార్పులు చేర్పులతో మరోసారి మీ ముందుకు వచ్చామని... అందరికీ అనుగుణంగా ఉండేలా ఈ బిల్లును తీసుకువస్తామని... అసెంబ్లీలో ప్రకటన చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్ రాజధాని తరహాలోనే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఉండాలని... తాము భావించామని... కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాంతాల మధ్య విభేదాలు రావద్దని నేపథ్యంలోనే అమరావతి రాజధాని కాదని మూడు రాజధానులు లకు తాము అడుగులు వేస్తామని స్పష్టం చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. కాగా నిన్న మూడు రాజధానులు రోడ్డు బిల్లులు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ బిల్లుకు శాసనసభ కూడా ఆమోదం తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp