ఆఫ్గ‌నిస్తాన్‌ను చ‌రబట్టిన తాలిబ‌న్‌ల వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఎప్పుడు ముందుంటున్నారు. అధికారం చేప‌ట్టిన త‌రువాత ష‌రియా చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తామ‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. అధికారం చేప‌ట్టిన అనంత‌రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాలిబ‌న్ల తీరులో ఎలాంటి మార్పు రావ‌డం లేదు. తాను ప‌ట్టిన కుందేలుకు రెండే కాళ్లు అన్నట్టు.. తాము చెప్పిన‌వే పాటించేవే స‌రైన‌వి అని అనుకుంటున్నారు తాలిబ‌న్‌లు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. టీవిల్లో ప్ర‌సారం అయ్యే షోలు, కార్య‌క్ర‌మాల్లో మ‌హిళ‌ల పాత్ర‌ల‌పై నిషేదం విధించారు. ఇందుకు త‌గిన ఆదేశాల‌ను, మార్గ ద‌ర్శ‌కాలు విడుద‌ల చేశారు.


తాలిబ‌న్ లు న‌మ్మె ష‌రియా చట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న సినిమాలు, కార్య‌క్ర‌మాల‌ను నిషేదించాల‌ని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు టీవీ కార్య‌క్ర‌మాల్లో పురుషులు త‌మ శ‌రీరాల‌ను చూపించ‌రాద‌ని తేల్చి చెప్పారు. ఇస్లాం మ‌తంపై జోకులు వేసే కామెడీ షోలు కూడా నిషేధిస్తూ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు తాలిబ‌న్‌లు. ఈ ఆదేశాల‌పై అఫ్గ‌నిస్తాన్‌లో భిన్నమైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మరో వైపు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది తాలిబ‌న్ ప్ర‌భుత్వం. అఫ్గ‌నిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న త‌రువాత త‌మ నిధుల‌ను స్తంభింపజేసింది అగ్రరాజ్యం అమెరికా.


ఈ నేప‌థ్యంలో తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఆర్థికంగా చితికిపోయింది. అలాగే, ఆహార కొర‌త‌తో తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతోంది. దీంతో ప‌లు దేశాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు తాలిబ‌న్‌లు . ముఖ్యంగా త‌మకు రావాల్సిన 9 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని అమెరికాకు ను హెచ్చ‌రించారు. లేని ప‌క్షంలో అఫ్ఘ‌నిస్తాన్ నుంచి వ‌ల‌స‌లు పెరుగుతాయ‌ని దీని వ‌ల్ల ప్ర‌పంచం అత‌లా కుత‌లం అవుతుంద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు తాలిబ‌న్‌ల ఆక్ర‌మణ‌ త‌రువాత అఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఒక‌వైపు తాలిబ‌న్‌ల అరాచ‌క పాల‌న‌తో పాటు ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో తీవ్ర ఇబ్బందుల పాల‌వుతున్నారు. ఇంక మున్ముందు తాలిబ‌న్‌లు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో..


మరింత సమాచారం తెలుసుకోండి: