ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్న సంగతి మనందరికీ విధితమే. గత శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి పార్టీ నేతలు చాలా అసభ్యంగా కరంగా మాట్లాడడం ఒక ఎత్తు అయితే... ఆ విషయాన్ని మీడియా ముందు వచ్చి చెబుతూ కంటతడి పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇలా అసెంబ్లీ చరిత్రలోనే ఓ ప్రతిపక్ష నాయకుడు కంటతడి పెట్టుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే ఈ కంట తడి ఈ వ్యవహారం... ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా... దేశ రాజకీయాలను సైతం ఈ వ్యవహారం కుదిపేసింది.  రాజకీయ ప్రముఖులు మరియు సినీ ప్రముఖులు ఇలా చాలామంది ఈ ఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 

అయితే ఈ కంటతడి వ్యవహారం మరువకముందే అందరిని కుదిపేసే వ్యవహారం మరొకటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో నిన్నటి రోజున చోటుచేసుకోవడం సంచలనాలకు దారి తీసింది. తగ్గేది లేదంటూ మూడు రాజధానులు వైపుగా అడుగులు వేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్... ఒక్క అడుగు వెనక్కి వేసింది. అవును.. మూడు రాజధానుల వ్యవహారంపై జగన్మోహన్ రెడ్డి... హైకోర్టు ఆగ్రహానికి అనుగుణంగా కాస్త వెనక్కి తగ్గింది. ఈ మేరకు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించేశారు.

తాము మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే ఈ సంఘటన మరువకముందే జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం నికి రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ని.. రద్దు చేసే దిశగా జగన్ మోహన్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తోంది. ఈమేరకు ఇవాళ అసెంబ్లీలో దీనిపై ప్రకటన వెలువడిన ఉన్నట్లు సమాచారం అందుతోంది. కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దీని పై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: