వైసీపీలో ముస‌లం మొద‌ల‌యింది. అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌యింది. త‌మ బాస్ ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అమ‌రావ‌తి కాదని విశాఖకు వ‌చ్చే ఆలోచ‌న ఉంద‌ని చెబుతున్నారు స‌రే! మ‌రి! అమ‌రావ‌తి ప్రాంతంలో రేగుతున్న నిర‌స‌న‌లకు ఏం స‌మాధానం చెబుతారని? విశాఖ కేంద్రంగా పాల‌న రాజ‌ధాని ఏర్పాటు చేస్తే అది ప్ర‌జా రాజ‌ధాని ఎలా అవుతుంద‌ని.. ఏదేమ‌యినా ఎక్క‌డ‌యినా రియ‌ల్ బూమ్ త‌ప్ప‌దు క‌దా అప్పుడు దానిని ప్ర‌జా రాజ‌ధాని అని ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని?

 
ఇలాంటివెన్నో మారుమూల ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌న్న ఆలోచ‌న నుంచి 3 రాజ‌ధానులు అన్న నిర్ణ‌యం పుట్టి ఉంటుంది. రాజ‌ధాని అన్న ప‌దం వాడితే త‌ప్ప పెట్టుబ‌డిదారులు రారు అని అనుకుని ఉంటారు. లేదా రాజ‌ధాని అన్న ప‌దం వాడ‌కుండా ఏం చేయాలో ఆలోచ‌న చేయ‌లేని స్థాయిలో ఉండి ఉంటారు. ప్ర‌జామోదం ఉన్న రాజ‌ధాని ఏదో ఎక్క‌డో ఎందుకో ఎవ్వ‌రికి అయినా తెలుసా? ఆ రోజు జ‌నం నుంచి అభ్యంత‌రాలు లేక‌పోతే మాకు అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉన్న ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నారు.

నిన్న త‌న‌కు అమ‌రావ‌తి అంటే త‌న‌కూ ప్రేమే అని త‌న ఇల్లు కూడా ఇక్క‌డే ఉంద‌ని అన్నారు. మ‌రి! ఏ నిర్ణ‌యం అయినా ఎవ‌రితో సంప్ర‌దించి వెలువరిస్తున్నార‌ని? లీగ‌ల్ గా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల‌నే బిల్లు ఆగిపోయింద‌ని చెబుతున్నారే ఆ రోజు బిల్లు డ్రాఫ్ట్ చేయించేట‌ప్పుడు ఇన్నింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వెళ్లలేక‌పోయారా? ఏడున్న‌రేళ్లు జ‌రిగాక కాలం గ‌డిచి పోయినాక మ‌ళ్లీ కొత్తగా ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణేంటి స‌ర్.. ఒక్క‌సారి మీరే పున‌రావ‌లోక‌న చేసుకోండి. ఇప్ప‌టికైనా ఓ స్ప‌ష్ట‌త రాజ‌ధాని విష‌య‌మై ఇవ్వండి. లేదా ఉమ్మ‌డి రాజ‌ధాని కాలాన్ని ఇంకొంత పొడిగించ‌మని అడ‌గండి. ఎలానూ ఉమ్మ‌డి రాజ‌ధానికి గ‌డువు 2024వ‌ర‌కూ ఉంది క‌నుక దానినే పొడిగించుకునే వెసులుబాటు విభ‌జ‌న చ‌ట్టం ఇచ్చింది క‌నుక ఆ ప‌ని అయినా త్వ‌రిత‌గ‌తిన చేయండి.

ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో
మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును నిన్న శాస‌న స‌భ‌లో వెన‌క్కు తీసున్నారు. దీనిని ర‌ద్దు చేస్తున్నామ‌ని త్వ‌ర‌లో మ‌రో బిల్లుతో స‌భ ముందుంటామ‌ని చెప్పారు జ‌గ‌న్. ఇదంతా బాగుంది. అస‌లు ఈ నిర్ణ‌యం వెనుక ఉన్న‌దెవ‌రు? ఈ 3 రాజధానుల నిర్ణ‌యం వ‌ల‌న బాగుప‌డిందెవ్వ‌రు? వీటికి ఏమ‌యినా స‌హేతుక‌త ఉందా లేదా కేవ‌లం జ‌నంలో క్రేజ్ తెచ్చుకునేందుకే ఇలాంటి నిర్ణ‌యాలు ఇచ్చారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp