తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లో కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సగానికి పైగా సిట్టింగులను పక్కనపెట్టారు. కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయం అటు సిట్టింగులకు ఇటు పార్టీ వర్గాలకు షాక్ గా మారిందట. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ షాక్ ల పరంపరను కొనసాగించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఆరుగురి ఎమ్మెల్సీల ఎంపికలో సంచలన రీతిలో ఎంపీని, జిల్లా కలెక్టర్ ని రాజీనామా చేయించి మరి అవకాశం కల్పించిన ఆయన ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీల భర్తీ విషయంలోను అనూహ్య ఎంపికలు చేపట్టారు. ఢిల్లీకి వెళ్లే ముందు సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ జాబితాను ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం స్థానిక కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జాబితా ఇలా ఉంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో గడువు ముగియనుండటంతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ మరో నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి బయలుదేరడానికి ముందే ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. ఏడుగురు సిట్టింగ్ లకు కెసిఆర్ షాకిచ్చారు. వారి స్థానాల్లో ఏడుగురు కొత్తవారికి  అవకాశం కల్పించారు. మొత్తం 12 పదవుల్లో బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు ఒకటి కేటాయించారు. 12 మంది టిఆర్ఎస్ అభ్యర్థులకు ఇప్పటికే బీఫామ్ లు అందాయని వారంతా సోమవారమే నామినేషన్ వేశారని తెలుస్తోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్.

 మహబూబ్ నగర్లో ఒకరికి, కరీంనగర్లో ఒకరికి కొత్తవారికి అవకాశం కల్పించారు. నల్గొండ జిల్లాలో ఊహించని విధంగా మార్పు చేశారు. సిట్టింగ్ చిన్నపరెడ్డికి ఖాయమని భావించిన, చివరి నిమిషంలో ఎంపీ కోటిరెడ్డికి అవకాశం కల్పించారు. చిన్నప్ప రెడ్డి తో పాటు కోటి రెడ్డిని కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గమే కావడం విశేషం. మెదక్ జిల్లా నుంచి భూపాల్ రెడ్డి స్థానంలో తెలంగాణ ఉద్యమకారుడు డా. మాధవ రెడ్డి ని మండలికి ఖరారు చేశారు కేసీఆర్. మరి ఛాన్స్ దక్కని వారి పరిస్థితి ఏమీటన్నది చర్చనీయ అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: