టీ కాంగ్రెస్ తలపడడానికి ప్రధాన అడ్డంకి నేతల సమన్వయ లోపమేనా..? దీనిపై హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఏంటి..? ఆ నిర్ణయం అమలు ఇప్పుడు ఎంత వరకు వచ్చిందనేది కీలకం గా మారిందట. రేవంత్ పిసిసి సారధి అయినప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో సఖ్యత కుదరడం లేదు. టిపిసిసి పదవి తనకే దక్కుతుందని మొదటి నుంచి ఆశపడి భంగపడ్డ కోమటిరెడ్డి రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకొనే సమస్యే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీలుచిక్కినప్పుడల్లా రేవంత్ పై విమర్శలు చేయడంతో పాటు టిపిసిసి నిర్ణయాలను ధిక్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు.

ఇదిలా ఉంటే టీ కాంగ్రెస్ కి అసలు సమస్యనాయకులు ఏకతాటిపై లేకపోవడమే.ఇదే అంశం ఇటీవల ఢిల్లీలో పార్టీ నేత కేసి వేణుగోపాలరావు సమక్షంలో జరిగిన సమావేశంలో ఓపెన్ గానే చర్చకు వచ్చింది. హైకమాండ్ నేతల తీరు పై సీరియస్ కావడంతో ఆ ఎఫెక్ట్ పని చేసిందో ఏమో ఇటీవల జరిగిన రైతు యాత్ర లో నాయకులు సెట్ అయినట్లు కనిపించింది. కోమటిరెడ్డి సోదరులను బుజ్జగించి పార్టీ కార్యక్రమాలకు వచ్చేలా రాయబారం నడిపే బాధ్యతను సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అప్పగించారు పిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం. ఆ తర్వాత కోమటిరెడ్డి సోదరులు, విహెచ్ మధ్య చర్చలయితే జరిగాయి కానీ వాటి ఫలితం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. దీంతో ఈ చర్చలు ఎంత వరకు వచ్చాయో, కోమటిరెడ్డి బ్రదర్స్ దారిలోకి వస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు. గాంధీ భవన్ వర్గాలకు, పార్టీ నేతలకు అది ఒక మిస్టరీగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు, పార్టీ బలోపేతానికి అడ్డుగా మారుతుందని  విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఢిల్లీ భేటీలో సీనియర్ల తీరుపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కోమటిరెడ్డి సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే విహెచ్ మాట్లాడితే కోమటిరెడ్డి, రేవంత్ కి చేరువ అవుతానేది కీలకమే. ఒకవేళ ఇద్దరూ కొంచెం వెనక్కి తగ్గి  ఒకే వేదిక మీదికి వస్తే అది పార్టీకి బలం గా మారడం ఖాయం. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: