శాసన మండలి రద్దు బిల్లును వెనక్కి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం... రెడీ అయ్యింది. ఈ విషయంపై ఇప్పటికే మంత్రివర్గంలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ సర్కార్‌కు  శాసన మండలిలో బలం తక్కువ. దీంతో అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు మండలిలో బ్రేక్ పడింది. దీంతో అసలు మండలి అవసరమా అని జగన్ ప్రశ్నించారు. ఎంతో మంది మేధావులు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారని.... ఇలాంటి సమయంలో మండలి అవసరం లేదన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే మండలిని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. వెంటనే కేంద్రానికి కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందిన బిల్లును పంపారు. అయితే ఈ ప్రక్రియ ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంది. అయితే ఇదే విషయంపై హైకోర్టులో కూడా విచారణ జరుగుతోంది. నిన్న మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను అసెంబ్లీలో రద్దు చేసినప్పటికీ.. ఆ వివరాలను హైకోర్టుకు మాత్రం సమర్పించలేక పోయింది ప్రభుత్వం.

గతంలో అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందిన బిల్లులు ఇప్పుడు రద్దు అయినప్పటికీ... ఆ వివరాలు హైకోర్టుకు సమర్పించాలి. వచ్చే శుక్రవారం నాటికి బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు సమర్పించాలని కూడా రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత... మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణను సోమవారం నుంచి తిరిగి ప్రారంభిస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని త్రి సభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఇదే అంశం కీలకంగా మారింది. బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టు అడ్వకేట్ జనరల్ తెలిపిన కొద్ది సేపటికి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే బిల్లులు రద్దు చేసినట్లు తెలిపినప్పటికీ... సభలో వైఎస్ జగన్ మాత్రం... మళ్లీ బిల్లు పెడతామని ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. మండలిలో ఇప్పటి వరకు 3 రాజధానుల బిల్లులు ఆమోదం పొందలేదు. అటు గవర్నర్ దృష్టికి కూడా ఆమోదం పొందినట్లు భావించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పరిస్థితుల్లో బిల్లును మండలిలో రద్దు చేయాలా వద్దా అనే అంశంపై మండలిలో ఎలా ప్రస్తావించాలని ప్రభుత్వం భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: