ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో మూడు రాజ‌ధానుల ఉప‌సంహ‌ర‌ణ బిల్లును ఏపీ ఆర్థిక‌శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఇవాళ శాస‌న మండ‌లిలో ప్ర‌వేశ‌పెట్టారు. పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ ర‌ద్దు చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ఇప్ప‌టికే అసెంబ్లీలో బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా బిల్లు ఆమోదింప‌జేయ‌డానికి శాస‌న‌మండ‌లిలో చ‌ట్ట ఉప‌సంహ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న శాస‌న‌మండ‌లిలో మాట్లాడుతూ..హైద‌రాబాద్ ఒక్క‌టే అభివృద్ధి చెందింద‌ని.. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ చాలా అవ‌స‌రం అని పేర్కొన్నారు. 

ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీల‌న్నింటిని ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కేవ‌లం హైద‌రాబాద్ న‌గ‌రంలోనే ప్ర‌వేశ‌పెట్టారు.  ఉమ్మ‌డి ఏపీలో అసెంబ్లీ అక్క‌డే. హైకోర్టు అక్క‌డే.. టూరిజం సిటీ, ఎల‌క్ట్రానిజం సిటీ, సాప్ట్‌వేర్ సిటీ వంటివి అక్క‌డే ఉన్నాయి. న‌వ‌ర‌త్నాలు అని 9 ర‌త్నాల‌ను ఒకేచోట ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా శ్రీ‌కాకుళం, విజ‌య‌నగ‌రం, విశాఖ‌ప‌ట్ట‌ణం, తూర్పు, ప‌శ్చిమ గోదావరి, కృష్ణా, ప్ర‌కాశం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం వంటి జిల్లాల ప‌రిస్థితి ఏమి కావాల‌ని మంత్రి బుగ్గ‌న గుర్తు చేసారు.  

వికేంద్రీక‌ర‌ణ అనేది ఎంత ముఖ్య‌మో.. ఎంత అవ‌స‌ర‌మో అనేది రాష్ట్ర పెద్ద‌లంద‌రూ బాగా గ‌మ‌నించాల‌ని కోరారు మంత్రి. రాష్ట్రంలో చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఉంద‌న్నారు. 2019లో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత  క‌న్వీన‌ర్‌గా జీఎస్ రావుతో పాటు ప‌లువురు మేధావుల అభిప్రాయాలను తీసుకొన్నారు. ప్ర‌భుత్వం హై ప‌వ‌ర్ క‌మిటీని వేసార‌ని, ఈ క‌మిటీలో రాష్ట్రమంత్రులున్నార‌ని, ఎక్స్‌ఫ‌ర్ట్ క‌మిటీ మ‌రో క‌మిటీని వేశారు. గ‌త ప్ర‌భుత్వం కూడా ఓ క‌మిటీని ఏర్పాటు చేసింద‌ని గుర్తు చేసింది. శ్రీ‌బాగ్ ఒప్పందం, చ‌రిత్ర‌ను చూసి ఈ ప్ర‌భుత్వం క‌మిటీని ఏర్పాటు చేస్తే.. గ‌త ప్ర‌భుత్వం ఏది ఫాలో కాలేద‌ని గుర్తు చేశారు మంత్రి బుగ్గ‌న‌. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో  రాష్ట్రం ఏవిధంగా ఉంది.. ఇప్పుడు ఏవిదంగా ఉంద‌నే విష‌యాన్ని ప్ర‌స్తావించారు.




 

మరింత సమాచారం తెలుసుకోండి: