పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం నిజం అవుతుంది అని ఎంతోమంది నమ్ముతుంటారు. అయితే ఇక బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం లోని ప్రతీ విషయం కూడా ఎప్పుడు ఒక సమయంలో జరగక తప్పదు అని చెబుతూ ఉంటారు. నిజంగానే బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన విషయాలు ఎన్నో ఇప్పటి వరకు జరిగాయి. అయితే ఇలా ఎన్నిసార్లు జరిగినప్పటికీ.. చాలామంది ఇప్పటికీ కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానం నమ్మడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ కాలజ్ఞానంలో చెప్పిన ఒక్క విషయం జరుగుతూ వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.



 కొన్ని రోజుల నుంచి తిరుపతి లో వర్షాలు ఏ రేంజ్ లో కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిత్తూరు జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ వరద నీరు నిండిపోయింది. ముఖ్యంగా తిరుపతిలో అయితే మునుపెన్నడూ లేని విధంగా భారీగా వరద నీరు వచ్చి ఎటుచూసినా పెద్ద పెద్ద జలపాతాలను తలపిస్తుంది వరద నీరు. అంతేకాదు రహదారులు మొత్తం మూసుకుపోయాయ్. దీంతో భక్తులు గుడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కేవలం భక్తులు మాత్రమే కాదు పూజారులు సైతం గుడిలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం వర్షాల కారణంగా.



 ఇలాంటి నేపథ్యంలోనే ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలోని ఒక వ్యాఖ్యం కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తిరుపతికి వెళ్లే అన్ని దారులు కూడా మూసుకుపోతాయి అంటూ రాసి ఉంది. ఇక ప్రస్తుతం అదే జరిగింది అని చెప్పాలి. నాలుగైదు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదల వచ్చి తిరుమల మొత్తం అతలాకుతలం అయిపోయింది. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డు మొత్తం కూలిన రాళ్లతో మెట్లమార్గం కూలిపోయి పూర్తిగా మట్టి పెల్లలతో నిండిపోయింది. అలిపిరిలో దేవాలయం మొత్తం నీట ప్రవాహం నిండిపోయింది. ఇలా బ్రహ్మంగారి కాలజ్ఞానం లో చెప్పినట్లు పూర్తిగా తిరుపతి వెళ్లే దారులు మూసుకుపోయాయి అన్న ఒక వాక్యం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: