ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు వియ్యం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే వేరే పార్టీలో ఉన్న రాజకీయ నేతలు కూడా వియ్యం అందుకుంటూ ఉంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు - పొంగూరు నారాయణ వియ్యం అందుకున్నారు. అప్పుడే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు - కొమ్మలపాటి శ్రీధర్ బాబు కూడా వియ్యంకులు అయ్యారు. అయితే ఈ పెళ్ళిళ్ళు వారు సొంతంగా కుదుర్చుకున్నారు.

అయితే ఇప్పుడు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్ద‌రు వియ్యంకులు అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య బంధుత్వం కుదిర్చింది సాక్షాత్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలుసు పార్థసారధి.. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ వియ్యంకులు అయ్యారు.

కొలుసు పార్థసారధి ఇటీవ‌ల తన కుమారుడు నితిన్ ను సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చారట‌. ఈ క్ర‌మంలోనే పెళ్లి అయ్యిందా ? ఎంత మంది పిల్ల‌లు అని ఆరా తీసిన సీఎం జ‌గ‌న్ ?  వివ‌రాలు క‌నుక్కున్నార‌ట‌. అయితే సార‌థి తన కుమారుడికి ఇంకా పెళ్లి కాలేదని పార్థసారధి సీఎం జగన్ కు చెప్పార‌ట‌. అదే స‌మంయ‌లో క‌నిగిరి ఎమ్మెల్యే మ‌ధు త‌న కుమార్తె కు పెళ్లి సంబంధాలు చూస్తున్నార‌న్న విష‌యం జ‌గ‌న్ కు తెలిసింద‌ట‌.

వెంట‌నే జ‌గ‌న్‌కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. ఇద్ద‌రూ ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో... ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పిల్లలకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న థాట్ ఆయ‌న‌కు వ‌చ్చింది. ఈ రెండు కుటుంబాలు క‌లిసి మాట్లాడు కోవాల‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో వీరు మాట్లాడుకో వ‌డం వీరి పెళ్లి సెట్ అవ్వ‌డం జ‌రిగింది. తాజాగా కానూరులో జ‌రిగిన ఈ పెళ్లికి జ‌గ‌న్ హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: