కృష్ణా జిల్లా కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ ఎన్నిక జ‌రిగిన నాటి నుంచి ఫ‌లితాలతో పాటు మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎన్నిక జ‌రిగే వ‌ర‌కు ఉత్కంఠ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొని ఉన్న‌ది. ఇప్ప‌టికే నిన్న జ‌ర‌గాల్సిన చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎన్నిక ఈరోజుకు వాయిదా ప‌డిన‌ది. ఈరోజు కూడా చైర్మ‌న్ ఎన్నిక స‌జావుగా జ‌రుగుతుందో లేదోన‌నే ఆందోళ‌న మొద‌లైంది.

కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వ‌ద్ద హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తున్న‌ది. ఆదివారం దాదాపు 200 మంది పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హిస్తే.. ఎన్నిక వాయిదా ప‌డ‌డంతో సోమ‌వారం 400 మంది భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసారు. ఎన్నిక ప్రాంగ‌ణం వ‌ద్ద ఓ వైపు టీడీపీ మ‌ద్ద‌తుదారులు, మ‌రోవైపు వైసీపీ మ‌ద్దతు కోరుతున్న‌ది ప్రాంగ‌ణం. ఇప్ప‌టికే వైసీపీ కార్య‌క‌ర్త‌లు మున్సిపాలిటీ ఆఫీస్ వ‌ద్ద‌కు చేరుకొని ఆందోళ‌న చేప‌డుతున్నారు. జై జ‌గ‌న్‌.. జై వైసీపీ.. నినాదాలు చేప‌డుతున్నారు. పోలీసులు భారీగా మోహ‌రించారు.

కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను జరిపి తీరాల్సిందేనని టీడీపీ పట్టుపడుతుంది . ఏదో విధంగా  ఈ ఎన్నిక ప్రక్రియను ఆపేందుకు వైసీపీ తనవంతు ప్రయత్నాలు చేస్తుంద‌ని పేర్కొంటుంది.  కొండపల్లి పంచాయితీ రసవ‌త్త‌రంగా మారిన‌ది.  మునిసిపల్ ఎన్నికల ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా జరిగిన పరిణామాలపై ఇప్ప‌టికే టీడీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గొడవ సృష్టిస్తున్న‌ వైసీపీపై చర్యలు తీసుకొని.. సజావుగా మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్‌, వైస్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక  జరిపించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసిన‌ది. హైకోర్టులో ఈ పిటిషన్ కు విచారణకు వచ్చే అవ‌కాశం  
క‌నిపిస్తోంది.

మ‌రోవైపు మొద‌టి రోజు కౌన్సిల్ హాల్‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఎన్నిక నిర్వ‌హించ‌లేక‌పోయామ‌ని పేర్కొంటున్నారు అధికారులు. ఈరోజు చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక ప్ర‌క్రియ స‌జావుగా నిర్వ‌హించకుంటే ఈ విష‌యాన్ని ఎస్ఈసీకి వివ‌రించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇవాళ ఎన్నిక చేప‌ట్ట‌కుంటే కోర్టు ధిక్క‌ర‌ణే అని పేర్కొంటున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. వైసీపీ-టీడీపీ నేత‌ల వాగ్వీవాదాలు..నిర‌స‌న‌లు, నినాదాల మ‌ధ్య కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ కార్యాల‌యం ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణంతో నెల‌కొని ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: