సాధారణంగా రాజకీయ నాయకులు పార్టీకి చెందిన కార్యకర్తలు ఏదైనా శుభకార్యాలు చేస్తే ఆశుభకార్యాలకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా వెళుతూ ఉంటారు. కానీఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాత్రం ఇలా కార్యకర్తల శుభకార్యాలకు వెళ్లడం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి సామాన్యుడు శుభకార్యానికి వెళ్తే ఇక ఆ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అందరూ. ఇక ఇప్పుడుఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కూడా అందరూ ఇలాగే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్ పర్యటనలో ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు ఒక అరుదైన ఆహ్వానం అందింది. అయితే ఆహ్వానం పంపింది ఎవరో రాజకీయ ప్రముఖులు అనుకుంటే మాత్రం పొరపాటే. ఒక ఆటో డ్రైవర్ తన ఇంటికి భోజనానికి రావాలి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ కు ఆహ్వానం పంపారు.. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి ఆహ్వానాలు రావడం సర్వసాధారణం. ఇవన్నీ పట్టించుకోరు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం డ్రైవర్ ఆహ్వానాన్ని మన్నించి స్వయంగా అతడి ఆటోలోనే డ్రైవర్ ఇంటికి భోజనానికి వెళ్లారు. అంతేకాదు అతడితో పాటు ఏకంగా నేలపై కూర్చుని భోజనం చేశారు.



 ఇటీవలే పంజాబ్ పర్యటనలో భాగంగా లుధియానా లో పర్యటించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అక్కడ స్థానిక ఆటో డ్రైవర్లతో సమావేశమైన వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న దిలీప్ తివారి అనే ఆటో డ్రైవర్ మీరంటే నాకు చాలా ఇష్టం.. మీరు ఎంతో మంది ఆటోడ్రైవర్లకు సహాయం చేసి అండగా నిలిచారు. ఇక ఇప్పుడు ఈ పేద ఆటో డ్రైవర్ ఇంటికి భోజనానికి రాగలరా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా అంటూ ఆటో డ్రైవర్ కోరగా తప్పకుండా వస్తాను ఈ రాత్రికి ఓకేనా అంటూ కేజ్రివాల్ రిప్లై ఇవ్వడం తో ఆటోడ్రైవర్ షాక్ అయ్యాడు. దీంతో ఇక దిలీప్ ఆటో ఎక్కిన కేజ్రీవాల్ ఆటోలోనే అతని ఇంటికి చేరుకుని భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cm