ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీలో 3 రాజధానులు ఉపసంహరణ బిల్లును ప్రకటించారు. తాము ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా సరికొత్త మూడు రాజధానులు బిల్లు తో మరోసారి శాస‌న స‌భ‌ ముందుకు వస్తానని ప్రకటన చేశారు. జగన్ ఈ మూడు రాజధానులు సరికొత్త బిల్లును తీసుకువచ్చే చట్టం చేసిన వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మూడు రాజధానులు - ముంద‌స్తు ముచ్చ‌ట‌ ఏంటి ఏంటి అన్నది లోతుగా ప‌రిశీలిస్తే చాలా విషయాలు కనిపిస్తున్నాయి. జగన్ ముందు నుంచి మూడు రాజధానులు తో అధికార వికేంద్రీకరణ కోరుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఇప్పుడు స‌రి కొత్త ప్లాన్ తో రెడీ అవుతున్నాడ‌ట‌. మూడు రాజ‌ధానుల కు ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌లు జై కొడుతున్నార‌న్న ది జ‌గ‌న్ కు క్లారిటీ వ‌చ్చేసింది. ఎందు కంటే ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రాజ‌ధాని జిల్లా లు అయిన గుంటూరు -  కృష్ణా జిల్లా ల ప్ర‌జ‌లు వైసీపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీనిని బ‌ట్టి ఇక్క‌డ ప్ర‌జ‌లు కూడా వికేంద్రీక‌ర‌ణ తో కూడిన అభివృద్ధే కోరుకుంటున్న‌ట్టు అయ్యింది. సో ఈ లెక్క‌న జ‌గ‌న్ రాజ‌ధాని విభ‌జ‌న విష‌యంలో ఎలాంటి సందేహం లేకుండా త‌న మాట మీదే ముందుకు వెళ్లిపోతోన్న ప‌రిస్థితి అయితే ఉంది.

ఇక ఈ ఊపుతోనే ముంద‌స్తు ఎన్నిక‌ల కు వెళితే జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు .. వికేంద్రీ క‌ర‌ణ‌తో కూడిన అభివృద్ధి నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ‌తారు. ఇటు టీడీపీ తో పాటు జ‌న‌సేన , బీజేపీ విడి విడిగా పోటీ చేసినా లేదా క‌లిసి కూట‌మి గా ఎన్నిక‌ల‌కు వెళ్లినా ఒకే రాజ‌ధాని .. అమరావ‌తిలోనే అభివృద్ధి నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉంటుది. అప్పుడు ఖ‌చ్చితంగా వికేంద్రీక‌ర‌ణ అభివృద్ధి దే గెలుపు అవుతుంది. మ‌రి జ‌గ‌న్ నిర్ణ‌యం ఎలా ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: